విధి ఆడిన వింత నాటకంలో మనిషి జీవితం కేవలం కీలుబొమ్మ లాంటిది. అందుకే ఎప్పుడు ఎలా మనిషి ప్రాణాలు పోతాయిఅన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఇక చిన్నపాటి జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు. ఏదైనా సమస్య ఎదురైంది అంటే ప్రతి ఒక్కరూ దేవాలయానికి  వెళ్లి దేవుని మొక్కుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం డాక్టర్లే ప్రత్యక్ష  దైవంగా మారిపోయారు. ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి ఇతరుల ప్రాణాలు రక్షించడానికి రంగంలోకి దిగి విధి నిర్వహణలో ప్రాణాలు వదులుతున్న వైద్యులు ఎంతోమంది ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో ప్రతి ఒక్కరికి వైద్యుల విలువ ఏంటి అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలిసి వచ్చింది అని చెప్పాలి.


 ఎవరైనా పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో డాక్టర్ల దగ్గరికి వస్తే ఏకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ పేషెంట్లకు ప్రాణాలు పోవడానికి డాక్టర్లు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక డాక్టర్ ఇలా ఏకంగా ఒక పేషెంటుకు ప్రాణం పోయడానికి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు. కానీ అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో ఆ డాక్టర్ ప్రాణాలు కూడా పోయాయి. ఏకంగా గుండె పోటుకు గురైన బాధితుడికు చికిత్స అందిస్తున్న సమయంలో డాక్టర్ కి కూడా గుండెపోటు రావడం గమనార్హం.


 దీంతో బాధితుడు తో పాటు డాక్టర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన అందరి మనసును కలచివేసింది. కామారెడ్డి జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది  గాంధారి మండలం గుంజాల తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఒక వైద్యుడు అతనికి చికిత్స చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా చికిత్స అందిస్తున్న వైద్యుడికి కూడా గుండెపోటు వచ్చింది. ఒక్కసారిగా డాక్టర్ కూడా చికిత్స చేస్తూ కుప్పకూలడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో పేషెంట్ తో పాటు డాక్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: