`ధ‌ర్మాన కృష్ణ‌దాసు.. ఇలా ఇరికించేశారేంటి?` అని వైసీపీ మంత్రుల మ‌ధ్య గుస‌గుస జోరుగానే వినిపిస్తోం ది. ఒక‌రుకాదు.. ఇద్ద‌రు కాదు.. దాదాపు ప‌ది మంది వ‌ర‌కు మంత్రులు ఇదే విష‌యంపై చ‌ర్చించుకుంటు న్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణ‌దాస్‌.. ప్ర‌స్తుతం డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రి గా ఉన్నారు. రాజ‌కీయంగా కూడా ఆయ‌న సీనియ‌ర్‌. ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయ‌న స‌మ‌ర్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానేఉన్నా.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి.

ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రా ల స‌మ‌యం సాగింది. దీనిలో.. రాష్ట్రంలో జ‌రుగుతు న్న భూక‌బ్జాల పై వైసీపీ స‌భ్యుడు ఒక‌రు ప్ర‌శ్న సంధించారు. ఇది స్టార్ ప్ర‌శ్న కావ‌డంతో మంత్రి మౌఖికంగా స‌మాధానం చెప్పాల్సి వ‌చ్చింది. వాస్త‌వానికి ఇలాంటి ప్ర‌శ్న‌ల విష‌యంలో మంత్రి చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఎక్క‌డా నొప్పి క‌ల‌గ‌కుండా.. ఏదైనా ఉంటే.. విప‌క్షం మీద‌కు తోసేసేలా .. లేదా .. గ‌త ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు చేసేలా ఉండాలి. కానీ, దాస్ గారు మాత్రం ఏమూడ్‌లో ఉన్నారో.. ఏమో.. అధికార పార్టీని ఇరుకున పెట్టేశారు.

`` అధ్య‌క్షా.. ఇలాంటి విష‌యాల్లో ఏం చెబుతాం ?  నిజం చెబితే.. ఎవ‌రికి మాత్రం న‌చ్చుతుంది .?  అయినా.. కూడా అడిగారు కాబ‌ట్టి.. చెబుతున్నా. భూక‌బ్జాలు చేసేది మ‌న‌మే!  వీటికి సంబంధించి మ‌ళ్లీ ప్ర‌శ్న‌లు అడిగేది మ‌న‌మే. చాలా జిల్లాల్లో వైసీపీ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌ని.. ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. మా శాఖ ద్వారా అడిగి తెలుసుకున్నా.. ఇది నిజ‌మేన‌ని తేలింది. చ‌ర్య‌లు తీసుకుంటున్నాం`` అని ముక్తాయించారు.

దీంతో వైసీపీ నాయ‌కులు.. మంత్రులు భుజాలు త‌ముడుకున్నారు. అదే స‌మ‌యం లో కొంద‌రు మంత్రి ధ‌ర్మా న ముక్కుసూటి త‌నంపై స‌టైర్లు వేస్తున్నారు. ఇలా చేస్తారా ?  మంత్రిగారూ.. ఇరికించే ప్ర‌య‌త్నం ఎందుకు ? అని ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: