మనదేశంలో నిరుద్యోగం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో చెప్పడానికి గుజరాత్ లోబనస్కాంత జిల్లాలోని పలన్ పూర్ లో జరిగిన ఓ ఘటన కళ్లకు కట్టింది. 600 గ్రామ రక్షాదళ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇందుకోసం వేలాదిగా నిరుద్యోగులు తరలివచ్చారు. వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఉద్యోగాల కోసం ఐదోతరగతి పూర్తి చేయాలి. రోజుకు 250రూపాయలు భత్యంగా చెల్లిస్తారు.

గుజరాత్ లో 600పోస్టుల కోసం భారీగా నిరుద్యోగులు తరలిరావడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. మోడీజీ ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన మాట తనకు గుర్తుందన్నారు. ఇప్పుడు మోడీ స్వరాష్ట్రమైన వైబ్రంట్ గుజరాత్ లో ఈ మిలియన్ మార్చ్ ఎందుకు..? దీనిపై బండి సంజయ్ ఏమైనా సమాధానం చెప్పలగరా ? అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమపై వైసీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కావడం లేదన్నారు. తాము దాచుకున్న డబ్బు కూడా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. 11వ పీఆర్సీ తక్షణం ప్రకటించాలని కోరినా స్పందిండం లేదని.. 13లక్షల ఉద్యోగులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు ఏపీ ప్రభుత్వంపై పోరాటానికి ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దుతో పాటు పలు డిమాండ్లను ప్రభఉత్వం ముందు పెట్టిన ఉద్యోగులు.. డిసెంబర్ 1న సీఎస్ కు నోటీసు ఇచ్చి, డిసెంబర్ 7నుండి 10వరకు జిల్లాల్లో బ్లాక్ బ్యాడ్జీలతో ప్రదర్శన, 10న లంచ్ అవర్ లో ప్రదర్శన, 13న నిరసన ర్యాలీ చేయనున్నారు. డిసెంబర్ 16న డివిజన్, ఆర్టీసీ డిపోల దగ్గర ఉదయం 9గంటల నుండి 2గంటల వరకు ధర్నాలు, 21న జిల్లాల్లో ఉద్యోగులు ధర్నాలు నిర్వహించనున్నారు.






 

మరింత సమాచారం తెలుసుకోండి: