యాసంగి వరి వేయొద్దని ప్రభుత్వం చేసిన ప్రకటన రైతులను అయోమయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే చాలా స్లోగా సాగుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి పంట సాగుపై సర్కార్ రైతులను గందరగోళానికి గురి చేస్తోందని, వరి పంట వేయొద్దని ప్రత్యామ్నాయ పంటలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతోంది. కానీ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు అంటే ఏ పంటలు వేసుకోవాలో తెలియడం లేదు. కనీసం వాటి గురించి అవగాహన కల్పించడం లేదు ప్రభుత్వ అధికారులు. దీంతో అయోమయంలో రైతులు ఉండటంతో  వారి యొక్క పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో రైతులు పాత పంటల అనేది వేయడం లేదు.

 కొంతమంది పంట కోసుకొని సిద్ధంగా ఉంచిన కొనుగోలు చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఖరీఫ్ ధాన్యం అమ్ముడుపోతే గాని యాసంగి పంట సాగు చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ సందర్భంలోనే యాసంగి సాగు ఆలస్యమైతే కత్తెర పంటను కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి లో 6.50లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేవారు . మరో 5 లక్షల ఎకరాల్లో కూరగాయలు పప్పుదినుసులు మిర్చి వంటి పంట సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది యాసంగి వరి సాగు చేయరాదనీ ప్రభుత్వం  ప్రకటన చేసింది. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారి కొనుగోలు విషయంలో చేతులెత్తేసింది. దీంతో రైతులకు సాగు పై ఎటు తెలుసుకోవడం లేదు. ఖరీఫ్ వరి పంట కొనుగోలు అంతంతమాత్రంగా సాగుతున్నాయి.

 వరి సాగు  ప్రభుత్వం వద్దన్న  చేస్తే కొనే రైతులు తలలు పట్టుకుంటున్నారు. యాసంగి లో మొత్తం సాగులో సగానికి పైగా వరి సాగు చేస్తారు. నవంబర్ మొదటి వారంలో  నారుమళ్లు  పోయాల్సి ఉంది. మార్చి వరకు పంట చేతికొచ్చేలా పంట సాగు చేయాలి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కత్తెర పంటల సాగు చేయాల్సి ఉంటుంది. యాసంగి పంట త్వరగా చేతికి వస్తే కత్తెర పంట వేస్తారు. లేకుంటే కత్తెర  వంటలు   కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా వరి సాగు  విషయంలో రైతులను ప్రభుత్వాలు సంకట స్థితిలోకి వెలుతున్నాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: