గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం తీరు పై నిరసనగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడమే కాదు ఏకంగా నిరసనలు కూడా తెలుపుతూ ఉండటం గమనార్హం. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రంగంలోకి దిగి కేంద్రం మెడలు వంచుతా అంటూ ధర్నా నిర్వహించడం కాస్త సంచలనంగా మారిపోయింది. రైతులు ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే ఢిల్లీ వచ్చి సైతం ఉద్యమం చేపడతామని అంటూ కేసీఆర్ ఏకంగా కేంద్రానికి సవాల్ విసరడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే యాసంగి లో వరి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదు అంటూఅటు కేంద్ర ప్రభుత్వం పలు మార్లు చెప్పడంతో ఇక మరోసారి కేంద్రం తీరుపై నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక ఇటీవల క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు సీఎం కెసిఆర్ నిర్ణయించారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇక ఈ క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా యాసంగి లో రైతులు వేసే ప్రత్యామ్నాయ పంటలపై కూడా చర్చించి మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట.


 అంతేకాదు రానున్న రోజుల్లో కేంద్రం తీరుపై ఎలా పోరాటం చేయాలనే అంశంపై కూడా క్యాబినెట్లో కీలక చర్చ జరుగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో కేంద్రం వైఖరిపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయంపై కూడా క్యాబినెట్ మీటింగ్ లో చర్చించపోతున్నారట. ఇక ప్రస్తుతం వివిధ దేశాల్లో మహమ్మారి కరోనా ఓమిక్రాన్  విజృంభిస్తుంది. దీంతో రానున్న రోజుల్లో కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా క్యాబినెట్ మీటింగ్ లో చర్చ జరగబోతుందట. ధరణి పోడు భూముల సబ్ కమిటీల నివేదికలు కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కూడా చర్చించ పోతున్నారు. మెట్రో ని ఆదుకోవడానికి నిధులు  కేటాయించడంపై కూడా క్యాబినెట్ మీటింగ్ లో చర్చించి పోతున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: