సాధారణంగా ఎవరైనా ఏదైనా నేరానికి పాల్పడ్డారు అంటే వారిని పోలీసులు అరెస్టు చేయడం ఆ తర్వాత వివిధ ఆధారాలు సేకరించి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరచటం లాంటివి చేస్తూ ఉంటారు.. ఇలా కోర్టు లోకి వెళ్ళిన తర్వాత అతడు చేసిన నేరాలపై విచారణ జరుగుతూ ఉంటుంది. ఇక అతను చేసిన నేరాలపై విచారణ జరిపిన తర్వాత చట్టంలోని సెక్షన్ ప్రకారం అతనికి జైలు శిక్ష విధిస్తూ ఉంటారు. ఒకవేళ అతడు పెద్ద నేరం చేసాడు అంటే చాలు వేగంగా యావజ్జీవ కారాగార శిక్ష సైతం వేధిస్తూ ఉంటుంది కోర్టు. ఇలా నేరాలు చేసిన వారికి శిక్షలు పడడం సర్వసాధారణం.



కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం కొంతమంది చేసిన పొరపాట్ల కారణంగా నేరాలు చేయకుండానే జైలు శిక్ష అనుభవించాల్సినా దుస్థితి ఏర్పడుతోంది. ఏకంగా చేయని నేరం లో ఇరుక్కొని చివరికి ఎంతోమంది జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అతను ఎలాంటి నేరం చేయలేదు కానీ జైలు శిక్ష అనుభవించాడు. అది కూడా ఒక నెల రెండు నెలలు కాదు ఏకంగా 43 ఏళ్ల పాటు జైలులో మగ్గీ పోయాడు. దానికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అమెరికాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మిస్సోరీ కి చెందిన కెవిన్ ను  దశాబ్దాల నిరీక్షణ తర్వాత జైలు నుంచి విడుదల అయ్యాడు. ఇటీవలే అతనిని నిర్దోషిగా తేలుస్తూ అతన్ని జైలు నుంచి విడుదల చేసింది కోర్టు. అతను 18 ఏళ్ళ వయస్సులో అరెస్టు అయి ఇప్పుడు 62 ఏళ్ళ వృద్ధుడి గా జైలు నుంచి బయటకు వచ్చాడు.  జీవితం మొత్తం 43 ఏళ్ల పాటు జైలులోనే గడిచిపోయింది. ఈ క్రమంలోనే అతనికి ఇటీవలే గో ఫండ్ మీ సంస్థ 10 కోట్లు విరాళంగా ఇవ్వడం గమనార్హం. దాదాపు నలభై మూడేళ్ళ క్రితం 1978 ఏప్రిల్ 25వ తేదీన కాన్సాస్ నగరం లో ఒక ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటనలో  ఇంట్లో ఉంటున్న  సింతీయ అనే మహిళ తప్పించుకుంది. తమ పై కాల్పులు జరిపిన వారిలో కెవిన్ కూడా ఉన్నాడు అంటూ పోలీసులకు చెప్పింది.. అయితే ఆ తర్వాత ఆ మహిళ పొరపాటు పడింది అని తెలిసినప్పటికీ ఆ విషయం చెబితే తనకు ఎక్కడ శిక్ష పడుతుందో అనీ భావించి నోరు విప్పలేదు. దీంతో చేయని నేరానికి అరెస్టు అయిన కెవిన్ కు 50 ఏళ్ల శిక్ష విధించింది కోర్టు. ఇటీవల సత్ప్రవర్తన కారణంగా 43 ఏళ్ల తరువాత విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: