మద్యపాన వినియోగం -మద్యపాన నిషేధం మధ్య స్పష్టమైన  విభజన రేఖ గీయడంలో రాష్ట్ర ప్రభుత్వాలతో సహా కేంద్ర ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిందని భావించాలి. ఆరోగ్యకరమైన భారతావని, ఇనుప కండరాలు ఉక్కు నరాలుతో కూడిన యువత, బలహీనతలను తొక్కి పెట్టగలిగిన మానవతా ధోరణి ఈ దేశంలో ఫరిఢవిల్లాలంటే మానసిక పరిపక్వతతో పాటు, విధి నిర్వహణ, కర్తవ్యం మీద కేంద్రీకరణ కూడా చాలా ముఖ్యం. అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిన భారతదేశం ఎన్నో ప్రకృతి వనరులు, ఎంతోమంది మేధావులు, ఎన్నో సాధన సంపత్తులను కలిగి ఉండి కూడా ప్రపంచ స్థాయి అనేక పోటీలలో సూచికలలో దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఉదాహరణం: పేదరికం, పత్రికా స్వాతంత్రం, ఆరోగ్యం, ఉపాధి కల్పన,పేదరికం తదితర రంగాలలో.

     మద్యపానానికి అభివృద్ధికి సంబంధం ఏమిటి..?
     అభివృద్ధి అంటే ఉత్పత్తి సంపద పెరుగుదల మాత్రమే కాకుండా ఆ సంపద దేశ ప్రజలందరికీ పoచబడిన రోజుననే ఆ పదానికి సార్థకత ఉంటుంది. అంటే మనిషి యొక్క సమస్త అవసరాలను తీర్చే క్రమంలో ఎదుగుదలని మానవాభివృద్ధి అంటారు. మానవాభివృద్ధి ఈనాడు భారత దేశ అభివృద్ధికి సూచికగా భారత ప్రఖ్యాత ఆర్థికవేత్త డాక్టర్ అమర్త్యసేన్ నొక్కి చెప్పిన విషయాన్ని పాలకులు, మేధావులు, సామాన్య ప్రజానీకం మరిచిపోకూడదు.
       కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో కోట్లాది ప్రజానీకం ఉంటే ఆ స్థితిని ఆ స్థితిని దారిద్రరేఖ దిగువ స్థాయి అంటారు.. ఈ స్థితి నుండి సుమారుగా 20 కోట్లకు పైగా ప్రజానీకాన్ని అభివృద్ధి స్థాయికి తీసుకు రావాల్సిన అవసరం పాలకులపై ఉంది. అంతరాలు, అసమానతలు, వివక్షత విచ్చలవిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అట్టడుగు వర్గాలు దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన ,ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించే స్థితిలో నీతివంతమైన టువంటి పరిపాలన అందించి ప్రజానీకాన్ని మానవతావాదులు గా తీర్చిదిద్దడం ప్రభుత్వాల బాధ్యత

మరింత సమాచారం తెలుసుకోండి: