స్మార్ట్ పోలీసింగ్ విధానంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొద‌టి స్థానంలో ఉంద‌ని హోంశాఖా మంత్రి మేకతోటి తెలిపారు. విజయవాడ నిర్మించిన రెండు పోలీస్ స్టేష‌న్ భ‌వ‌నాల‌ను ఆమె ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా హోం శాఖ మంత్రి సుచ‌రిత మాట్లాడారు. ఆధునిక పరిజ్ఞానం తో  విజయవాడ లో రెండు పోలీస్ స్టేషన్లు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాం అని తెలిపారు. సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వచ్చిన త‌రువాత‌నే నూతన భవనాల నిర్మాణం జరిగింది అని చెప్పుకొచ్చారు.


2.5 కోట్ల రూపాయ‌ల‌తో భవానీపురం, 2.7 కోట్ల రూపాయ‌ల‌తో కృష్ణలంక పోలీస్ స్టేషన్లు నిర్మించిన‌ట్టు వివ‌రించారు.   అలాగే.. స్మార్ట్ పోలీసింగ్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముందు వ‌రుస‌లో ఉంద‌ని చెప్పారు. 90 రోజులు నుంచి 42 రోజుల్లో ఛార్జ్ షీటు వేసేలా చేసాం అని తెలిపారు. 90 లక్షల మంది దిశ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్నారు అని చెప్పారు. కొత్తగా సచివాలయాల్లో 14 వేల మంది మహిళా పోలీసులను నియమించిన‌ట్టు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా అవసరం ఉన్న చోట  నూతన భవనాల నిర్మాణం చేపడతాం అని ఈ సంద‌ర్భంగా హోం శాఖ మంత్రి సుచ‌రిత వెల్ల‌డించారు.


   ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మహిళలకు అన్ని విధాల సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా వినియోగిస్తున్నాం అని చెప్పారు. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నామ‌ని, వెయ్యి కోట్ల రూపాయ‌ల విలువైన గంజాయి‌ ని ఈ మధ్య కాలంలో ధ్వంసం చేసిన‌ట్టు పేర్కొన్నారు హోంమంత్రి సుచ‌రిత‌. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవ‌ల గంజాయ్ విక్ర‌యాలు భారీగా పెరిగిపోయాయి. అడ్డ‌దారిలో తొంద‌ర‌గా డ‌బ్బు సంపాదించాల‌నే ఆశ‌తో ప‌లువురు గంజాయ్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇటీవ‌ల హెర్భ‌ల్ ఉత్ప‌త్తులు, క‌రివేపాకు పేరుతో ఈ కామ‌ర్స్  వెబ్ సైట్ అమెజాన్‌లో గంజాయ్ విక్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాలపై ప్ర‌భుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: