సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పని చేసిన లక్ష్మీనారాయణ అప్పట్లో పెద్ద సంచలనం రేపారు. ముఖ్యంగా జగన్ అక్రమాస్తుల కేసును విచారించిన తర్వాత లక్ష్మీనారాయణ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. అప్పటి వరకు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారో ? కూడా ఎవరికీ తెలియదు. జగన్ అక్రమాస్తుల కేసులో చాలా సీరియస్‌గా ఆయన విచారణ చేశారు. గత ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేసిన ఆయ‌న బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయ‌న‌ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో పార్టీలో చేరారు. గ‌త‌ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసిన జేడీ గెలుస్తారని అందరూ అనుకున్నారు.

అయితే వైసిపి ప్రభంజ‌నంలో ఆయన ఓడిపోవడం తో పాటు మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే వైజాగ్ లో జెడి జనసేన నుంచి పోటీ చేయడం తో భారీగా ఓట్లు చేరి... అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జనసేన కు దూరం అయిన జేడీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొద్ది రోజుల నుంచి జేడీ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఆయన మాట్లాడుతూ లోక్సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ కూడా ఆ పార్టీని నడిపించాల్సింది గా తనను కోరారని చెప్పారు. అయితే వైసీపీ ఎంపీలతో పాటు మరి కొందరు వైసీపీ నాయకులు కూడా తనను కలిసి వైసీపీ లోకి రావాలని కోరారు... పార్టీలోకి వస్తే బంపర్ ఆఫర్ వుంటుందని కూడా హామీ ఇచ్చారని... తాను మాత్రం ఆ పార్టీలోకి రాను అని చెప్పాను అని జేడీ చెప్పారు.

ఇక పవన్ కళ్యాణ్ తిరిగి ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా జేడీ సంకేతాలు ఇచ్చారు. మరి జేడీ పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఎలా ? ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: