ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక్క అంశం కరోనా వైరస్. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాయి. దాదాపు రెండు నెలల పాటు ప్రపంచం అంతా స్తంభించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. చివరికి మన చుట్టు పక్కల ఉన్న వాళ్లు ఎవరైనా తుమ్మినా, దగ్గినా కూడా... అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.... క్రమంగా అంతా సాధారణ పరిస్థితికి చేరుకున్నాయి. ఈ ఏడాది జనవరి నెల 16వ తేదీ నుంచి భారత దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా డోసులు వేసేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది కూడా. అయితే వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో సెకండ్ వేవ్ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. మరోసారి ప్రతి ఒక్కరు ఇళ్లకు పరిమితం అయ్యేలా చేసింది. వందల మందిని పొట్టన పెట్టుకుంది. నెమ్మదిగా పరిస్థితి కుదుట పడుతుందనే సమయంలో.. ఇప్పుడు కొత్త కలకలం రేపింది.

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రస్తుతం అందరికీ భయపెడుతోంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే రాకపోకలపై అన్ని దేశాలు ఇప్పటికే నిషేధం విధిస్తున్నాయి. ఇక కొత్తగా ఎవరైనా ఆఫ్రికా దేశం నుంచి వస్తే.. వారిని వెంటనే క్వారంటైన్‌కకు తరలిస్తున్నారు కూడా. ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా ఓమిక్రాన్ వేరియంట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. దేశ ప్రజలకు కూడా మోదీ హెచ్చరికలు జారీ చేశారు. కొత్త వేరియంట్ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే వైరస్ కెనడా దేశంలో ప్రవేశించినట్లు తెలిపారు. ఓమిక్రాన్ వేరియంట్‌ ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతోంది కూడా. డిసెంబర్ 15వ తేదీ నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని ముందుగా భావించినట్లు మోదీ తెలిపారు. అయితే.... ఓమిక్రాన్ కారణంగా... తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామన్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులపై మరికొంత కాలం పాటు నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు ప్రధాని మోదీ.


మరింత సమాచారం తెలుసుకోండి: