ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అధికార పార్టీ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. గత దశాబ్దకాలంగా అక్కడ వైసీపీ తిరుగులేకుండా సత్తా చాటింది. 2011లో కడప పార్లమెంటు , పులివెందుల అసెంబ్లీ కి జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ వైఎస్ విజయలక్ష్మి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో రైల్వేకోడూరు - రాయచోటి - రాజంపేట నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులు ఏకంగా 40 వేల ఓట్ల పై చిలుకు భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. నాటి నుంచి నేటి వరకు కూడా జిల్లాలో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది.

వైసిపి ఆవిర్భావం తర్వాత కడప - రాజంపేట లోక్‌స‌భ సెగ్మెంట్లలో ఆ పార్టీ ఓడిపోలేదు. ఒక్క 2014లో మాత్రమే రాజంపేట ఎమ్మెల్యే సీటు ఆ పార్టీ కోల్పోయింది. మధ్యలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. ఈ రెండు ఓట‌ములు మినహా జిల్లాలో అసలు వైసీపీకి ఓటమి అనేది లేకుండా పోయింది. అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలో ఉన్న కొందరు సీనియర్లు కూడా వచ్చే ఎన్నికలకు ముందు టిడిపిలో చేరే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీమంత్రి మైదుకూరు నియోజక వర్గానికి చెందిన డి.ఎల్.రవీంద్రారెడ్డి వైసీపీని వీడారు. ఆయ‌న టీడీపీలో చేరి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరు నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు. ఇక జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజక వర్గానికి చెందిన మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కూడా కొద్ది రోజుల పాటు వేచి చూసి ఆ తర్వాత టిడిపి లోకి వెళ్లి పోయేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల‌ నియోజక వర్గానికి చెందిన సతీష్ రెడ్డి కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైసీపీలో చేర లేదు. ఆయన కూడా త్వరలోనే టీడీపీలో చేరుతారని అంటున్నారు. ఏదేమైనా కడప జిల్లాలో ఫ్యాన్ పార్టీకి ఎదురు గాలి తగులుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: