చైనా తన పని కానిచ్చుకోవడం కోసం ఎంతవరకైనా పోతుంది. పని కావడం ప్రదానం అనుకుంటూ, ఎంతైనా లంచంగా ఇచ్చేస్తుంది. చేయి తడిపేస్తూ తన కు కావాల్సిన దానిని పూర్తి చేయించుకోవడంలో బాగా ఆరితేరింది. ఇదంతా తన దేశంలో కాదు, ఇతర చోట్ల తన పని కనిచేసుకోవడానికి చైనా అధికారులు వాడే చక్కటి అస్త్రం. అందుకే చైనా వెళ్లిందంటే దాదాపు అక్కడ దానికి జరగాల్సిన పని అయిపోయినట్టే. అందుకు ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది బాగా అవపోసన పట్టేసింది చైనా. అంతర్జాతీయంగా ఏ పని కావాలి అన్నా నేరుగా చైనా వద్దకు వెళ్లి పలానా పని పూర్తికావాలి అని చెపితే చాలు, అక్కడ పలానా అధికారి ఉంటాడు, అతగాడి విలువ ఇంత అని చెప్పేస్తుంది. దానితో ఆ మొత్తం చేతిలో పెట్టుకుని పోతే పని అయిపోయినట్టే అన్నమాట.

ఒక మయన్మార్ కావచ్చు, నేపాల్ హోళీశర్మ కు కావచ్చు, మరొకటి కావచ్చు చైనా అనుకున్నట్టుగా ఉన్నాయంటే కారణం, అక్కడ ఎవరికి ఏమి ఇస్తే తన పని తాను అనుకున్నట్టుగా జరిగిపోతుందో చైనా కు తెలుసు కాబట్టే. అందుకే అంత సులభంగా ఆయా దేశాలలో ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టి, తుపాకీ వ్యవస్థను తెచ్చేసింది. ఇదంతా అంతర్జాతీయంగా చాలా పెద్ద సమస్య అవుతుంది. అలా ఒక జడ్జి తనకు అడ్డుగా ఉంటె కేవలం ఆయనను దారి నుండి తప్పించడానికి ఆ దేశం లో ప్రభుత్వాన్నే మార్చేసింది చైనా. ఇంతగా ఇతర దేశాలను లంచాలతో చైనా ప్రభావితం చేస్తుంది. మయన్మార్ లో అధికారులకు లంచాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని దించి, సైనికుల పాలనను తెచ్చింది.

ఇక తాజాగా జరిగిన సల్మాన్ ఐలాండ్ లో కూడా చైనా ఇచ్చింది పుచ్చుకున్న అధినేతలు కొందరు తైవాన్ విషయంలో చైనాకు వంత పలకడంతో అక్కడి ప్రజలు ఆగ్రహానికి గురై, పార్లమెంట్ ను తగలబెట్టేశారు. అయితే దీనికంతటికి కారణం పలానా అధికారులు అని ఎప్పుడైనా ఆ ప్రజలకు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఊహించలేము. ఇక దీనివెనుక చైనా లంచగొండితనం ఉన్నదని తెలిస్తే దాని పరిస్థితి కూడా అంతే. ఇప్పటికే ప్రపంచ దేశాలు పట్టించుకోకుండా పక్కన పడేసిన దేశాల జాబితాలో పాక్, చైనా చేరిపోయాయి. కనీసం ఆఫ్ఘన్ ను గురించి తలుచుకొని అయ్యయ్యో అంటారేమో కానీ, పాక్ చైనా పెద్ద ప్రకృతి వైపరీత్యం వచ్చి సర్వనాశనం అయిపోతే, పీడ పోయింది అనుకుంటుంది కాబోలు ప్రపంచం మొత్తం. ఇది వాటి బ్రతుకులు, అయినా కుట్రలు తప్ప బుద్ధి మార్చుకోవడం లేదు. కుక్కతోక వంకర అనే సామెతకు కూడా ఒక లైవ్ ఉదాహరణ కావొద్దు!

మరింత సమాచారం తెలుసుకోండి: