పాక్ పౌర సమాచారం దొంగిలించబడిందట. దాని పౌరసత్వం తో ఎవరు ఏమి చేసుకుంటారో మరి. ఆ దొంగిలించిన వారికి ఇంకో దేశం దొరకలేదా లేక ఒక చిన్న ప్రాక్టీస్ కింద పాక్ ను ఎంచుకున్నారో మరి తెలియదు కానీ, పాక్ సమాచారం దొంగిలించారట. పాక్ ప్రభుత్వం ఎంతసేపు దొంగిలించారు అని చెప్పుకుంటుంది కానీ, దానికి కారణం తాను నమ్ముకున్న దేశం అని చెప్పడం నోరు రావడం లేదేంటో. తీరా చైనా అని చెప్పేస్తే, ఉన్న తోడు పోతుందనే భయం కావచ్చు. ఏది ఏమైనా పాక్ పరిస్థితి తెలు కుట్టిన దొంగ మాదిరి అయ్యింది. అరవలేదు, నొప్పిని ఓర్చుకోవడం తప్ప. చైనా కూడా పాక్ సమాచారంతో ఏమి చేసుకుంటుందో మరి, ఏదో ప్రాక్టీస్ కింద ఈ పని చేసి ఉంటుంది. పాక్ కనిపెడుతుందా లేదా అని తెలుసుకోవడానికి, పాక్ లాంటి దేశమే కనిపెట్టింది అంటే మిగిలిన వారు ఖచ్చితంగా కనిపెడతారు కాబట్టి తన ప్రాక్టీస్ ఒక రకంగా విఫలం అయినట్టే, మరోరకంగా సఫలం కూడా అయినట్టే.

దొంగిలించింది చైనా అని చెప్పుకోలేని పాక్, మరే దేశాన్ని కూడా చేయెత్తి చూపించలేదు కాబట్టి అన్నిటికి దానికి కనిపించేది ఒకే దేశం అదే భారత్. అందుకే ఈ విషయంపై కూడా భారత్ వైపు చూస్తూ నా దేశ సమాచారం ఎవరో దొంగిలించారు అంటూ వాపోతుంది. శవాల దిబ్బను కూడా కబ్జా చేసి ఇళ్లు కట్టే వ్యాపారాలు ఉండొచ్చు గాని, ఆ దిబ్బలు పాక్ లో ఉంటె, బహుశా వాటి జోలికి ఎవరు పోరు కావచ్చు. నిజమే దాదాపుగా అదే స్థితిలో ఉన్న ఆఫ్ఘన్ జోలికి లేదా పాక్ జోలికి ఎవరు పోతారు. అక్కడ కు వెళ్లి జీవించాలని ఎవరు మాత్రం అనుకుంటారు. అసలు ఏదో ఉంది కాబట్టి ఉన్నట్టే కానీ, పాక్ ను ప్రపంచం ఎప్పుడో మరిచిపోయింది.

ఇంకా నేను ఉన్నాను అని గుర్తుచేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా ఏదో ఒక సాకుతో ప్రపంచం ముందుకు వస్తుంది. ఇంకో సందర్భం లో కూడా పాక్ గుర్తుకు వస్తుంది, అదేమంటే ఎక్కడైనా ఏదైనా బాంబు పేలితే ఖచ్చితంగా అందరు పాక్ ప్రేరేపిత తీవ్రవాదం అని ఆ దేశాన్ని తలుచుకోక మానరు. ఇది దాని పరిస్థితి, అలాంటి దేశంలో పౌరులు, వాళ్లకు గుర్తింపు కార్డులు, ఆ సమాచారం ఎవరో దొంగిలించడం, ఇదొక సమాచారం. దానిని చెప్పుకొని ఇమ్రాన్ గారు బాధపడటం. ఎన్నడూ చూడని విశేషాలు కరోనా సమయంలో చూడాల్సి వస్తుంది. అందులో ఇలాంటివి కూడా వస్తూపోతుంటాయి అనుకోవడమే.

మరింత సమాచారం తెలుసుకోండి: