ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఒకే ఒక భయం పట్టుకుంది. అదే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కొత్త ఓమిక్రాన్ వైరస్ గురించి. ఇప్పటికే ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ గడగడలాడించింది అని చెప్పాలి. మొదటి దశ, రెండవ దశ అంటూ రెండు సార్లు ఇంకా ప్రపంచ దేశాలలో అల్లకల్లోల పరిస్థితులు తీసుకువచ్చింది.  అయితే ప్రస్తుతం రెండవ దశ కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు ఆంక్షలను సడలిస్తూ ఉండటం గమనార్హం. అయితే అంతలోనే అగ్రరాజ్యాల లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో  మళ్లీ ఆంక్షలు అమలులోకి తెస్తున్నాయి  ప్రభుత్వాలు. ఇలాంటి సమయంలో కొత్తరకం ఓమిక్రాన్ వైరస్ వెలుగులోకి రావడం మాత్రం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి.


ఓమిక్రాన్ వైరస్ ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్ని దేశాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఆటో భారత్ ని కూడా ఓమిక్రాన్ వేరియంట్ వణికిస్తుంది అని చెప్పాలి. దీంతో ఎక్కడ చాన్స్ తీసుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టులో కొత్త వేరియంట్ పై కేంద్రం గైడ్లైన్స్ విడుదల చేసింది. ఓమిక్రాన్ ప్రభావం ఉన్న దేశాల నుంచి వస్తే టెస్టింగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం గమనార్హం. వాక్సినేషన్ తో సంబంధం లేకుండా ఎయిర్పోర్టులో టెస్టింగ్ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.


 ఇలా ఎయిర్పోర్టులో  వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసిన సమయంలో పాజిటివ్ అని తేలితే నేరుగా క్వారంటైన్ కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసింది. అంతే కాదు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అందరికీ కూడా ఆర్ టి పి సి ఆర్ టెస్ట్ తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ లో తెలిపింది. ఇక ఈ ఆర్ టి పి సి ఆర్ పరీక్షల్లో నెగటివ్ వస్తే ఎయిర్ పోర్ట్  నుంచి బయటకు పంపించాలి అంటూ స్పష్టంగా తెలిపింది. శాంపిల్స్ సేకరించి జెనోమ్ సీక్వెన్సింగ్ కోసం తరలించాలి అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చింది కేంద్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: