భారతదేశ చరిత్రలో మనం కళింగ చక్రవర్తి అశోకుడు గురించి విన్నాం. అశోకుడు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఎప్పుడు ఏ కష్టం కలగకుండా చూసుకునేవారు. తనను నమ్ముకున్న ప్రజలకు అశోకుడు ఏనాడు అన్యాయం చేయలేదు. దానధర్మాలు చేసే విషయంలో అశోకుడికి సాటిరాగల చక్రవర్తి భారత దేశంలోనే లేడు. నేటి కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థలో ఎవరో ఒకరిద్దరు తప్ప అందరు ప్రజాప్రతినిధులు అవినీతిలో కూరుకుపోయి... ప్రజలను, తమ సొంత పార్టీ నేతలనే పీడించుకుని తింటోన్న రోజులు ఇవి.
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో కూడా అవినీతికి దూరంగా... తనను నమ్ముకున్న ప్రజలకు తానొక్కడి ఉంటే చాలు అన్న భరోసా ఇచ్చే వారు అతి కొద్ది మంది నాయకులు మాత్రమే ఉంటారు. ఈ కోవలోకే వస్తారు... పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ కీలక నేత మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు. ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆత్మ‌గా పేరున్న‌ మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుకు స్వయాన బావమరిది అయిన అశోక్ పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో రెండున్నర దశాబ్దాలుగా కీలక నేతగా ఉన్నారు.

విద్యాధ‌ర‌రావు అనుంగు శిష్యుడిగా ప్ర‌స్ధానం :
దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు అనుంగు శిష్యుడుగా మెట్ట ప్రాంతంలో కీలక పాత్ర పోషించిన అశోక్ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అశోక్ దివంగత నేత వైఎస్ఆర్ తో పాటు ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత ఆప్తుడు. తన మనసులో ఉన్న ఏ విషయాన్ని అయినా ఉన్నది ఉన్నట్టు ముఖ్యమంత్రి వద్దే కొండ బద్దలు కొట్టడంలో అశోక్‌కు అశోక్ సాటి. వైఎస్ఆర్ కుటుంబంతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధానికి చిన్న మచ్చ కూడా తెచ్చేలా ఎప్పుడు అశోక్ వ్యవహరించలేదు.

అవినీతిలో జీరో.. ప్ర‌జాసేవ‌లో హీరో...
ఇన్నేళ్ల సుధీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానంలో అశోక్ ప్ర‌జ‌ల నుంచి ఈ రూపాయి తీసుకున్నారు.. ప‌లానా ప‌నికోసం వెళితే క‌మీష‌న్ అడిగారు.. ప‌నుల్లో క‌మీష‌న్లు, వాటాలు తీసుకున్నారు అన్న చిన్న ఆరోప‌ణ కూడా ఆయ‌న‌పై లేదు. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్య‌క్తిగా అశోక్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇన్నేళ్ల‌లో అశోక్‌పై చిన్న అవినీతి ఆరోప‌ణ కూడా లేక‌పోవడానికి ఆయ‌న త‌న సొంత సంపాద‌నే చేతికి ఎముక‌లేని చందంగా ఖ‌ర్చు చేయ‌డ‌మే..!

రాజ‌కీయంగా చ‌క్రం తిప్పుతోన్న వైనం...
చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ రాజ‌కీయాల్లో అశోక్ అధికార  పార్టీలో కీ రోల్‌గా మారారు. సొంత పార్టీలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌తిప‌క్ష పార్టీలో ఉన్న అశోక్ ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌లిపి కుళ్లు రాజ‌కీయం చేస్తున్నా కూడా అశోక్ ధీటుగా తిప్పికొడుతున్నారు. అశోక్ స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి కామ‌వ‌ర‌పుకోట ఎంపీపీగా ఉండగా. ఆయ‌న కుమార్తె కేఎస్‌. రామ‌వ‌రం స‌ర్పంచ్‌గా ఉన్నారు.

ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మ‌న‌స్సుల్లోనూ స్థానం:
అశోక్ కేవ‌లం అధికార పార్టీ కేడ‌ర్‌, నేత‌ల మ‌న‌స్సుల్లోనే కాకుండా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన  నేత‌ల మ‌న‌స్సుల్లో కూడా ప్ర‌త్యేక‌మైన స్థానం సంపాదించుకున్నారు. రాజ‌కీయాలు ఎన్నిక‌ల వ‌ర‌కే చేయాలి.. అభివృద్ధి, అత్య‌వ‌స‌ర సాయాలు అనేవి మ‌నిషిగా ఎవ‌రికి అయినా చేయాల‌న్న‌దే ఆయ‌న సిద్ధాంతం. అందుకే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఇబ్బందుల్లో ఉన్నా రాజ‌కీయ కోణంలో చూడ‌కుండా ఆయ‌న వారికి ఎన్నో సార్లు ఆప‌న్న హ‌స్తం అందిస్తూ ఉంటారు.

2024 ఎన్నిక‌ల్లో అశోక చ‌క్రమే....
చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ అధికార పార్టీలో మారుతోన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అశోక్ కీల‌కం కానున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విజ‌యం సాధించ‌డంతో పాటు భారీ మెజార్టీ రావ‌డంలో అశోక్‌ది కీ రోల్‌. ఇప్పుడు సొంత పార్టీలోనే కొంద‌రు ఆయ‌న్ను ఎన్ని ఇబ్బందులు పెట్టేందుకు ప్ర‌య‌త్నించినా 2024లో మ‌ళ్లీ ఆయ‌నే కీల‌కం కానున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: