ఎన్నో నెలలుగా రైతు ఉద్యమం దేశరాజధానిలో కొనసాగింది. దీనికి కారణం కొత్తగా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు. వాటిని పూర్తిగా అమలు కూడా చేయకుండానే ఉద్యమం నేపథ్యంలో కేంద్రం రద్దు చేసింది. అప్పటికైనా రైతులు ఉద్యమం ఆపేసి, తమతమ స్థానాలకు వెళతారనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. కానీ అలా జరగలేదు. ఇంకా ఉద్యమం కొనసాగింపు ఉంటుందని రైతు నాయకులు స్పష్టం చేశారు. అయితే వాళ్లకు వద్దన్న చట్టాలు రద్దు చేసినా కూడా ఉద్యమం కొనసాగిస్తాం అంటూనే ఉన్నారు. రైతు ఉద్యమం ప్రారంభంలోనే కొన్ని తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రైతుల ఉద్యమంలో అసాంఘిక శక్తులు చేరి ఉద్యమం పేరుతో రాజధానిలో అల్లకల్లోలం చేయాలన్నది వాళ్ళ ఆలోచన.

అలాగే జాతీయ పార్టీలు కొన్ని ఈ దుండగులతో చేతులు కలిపి ఇలాంటి ఘటనలు జరిపిస్తే, తద్వారా ప్రస్తుత ప్రభుత్వంపై మచ్చ వస్తుంది. దానిని సాకుగా చూపించి అధికారంలో నుండి దించేయవచ్చు అనేది వాళ్ళ ప్రణాళిక. అందుకే దానికి రైతు ఉద్యమాన్ని అడ్డుపెట్టుకున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఊహించని  ఘటన ఏమిటంటే, బీజేపీ ప్రభుత్వం రైతుచట్టాలపై వెనక్కి తగ్గడం. కేంద్రం కూడా నిఘా వ్యవస్థల సమాచారంతో ఉద్యమం విరమింపచేసే నిర్ణయం తీసుకోక తప్పలేదు. అందుకే అందరి మంచి కోసం చట్టాలను కూడా రద్దు చేసింది కేంద్రం. తాము అనుకున్న లక్ష్యం సాధించకుండా ఉద్యమం నీరుకారిపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఆయా పార్టీలు రైతులను మరోసారి తప్పుదారి పట్టించి ఉద్యమ కొనసాగింపుకు ప్రణాళికలు వేశాయి.

అయితే ఇక్కడ రైతు నాయకత్వం ఆయా పెద్దలకు బయపడిందా లేక వాళ్ళు అమ్ముడుపోయారా అనేది చిన్న ప్రశ్న ఉంది. ఏది ఏమైనా ఇది ప్రమాదానికి దారి తీసే అంశం, దీనిపై నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. అందుకే పార్లమెంట్ సెషన్స్ తాజాగా ప్రారంభం కాగానే అందులో మొదటిగా రైతు చట్టాలను రద్దు చేసే ప్రక్రియ మొదలు పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. అది జరిగితే ఉద్యమం ఆగిపోతుందని ఉద్దేశ్యంతో మొదటి రోజే నానా యాగీ చేసి, సభను వాయిదా వేయించాయి ఆయా పార్టీలు. ఇది వాళ్ళు చేసే బాగోతాలు. రైతులను అడ్డుపెట్టుకొని, అధికారం కోసం దేశద్రోహానికి పాల్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: