కరోనా ఫస్‌, సెకండ్‌ వేవ్‌లను చూసేసిన భారతీయులు ఇప్పుడు కాస్త రిలాక్స్‌ గా ఉన్నారు. కరోనా కష్టాల నుంచి కోలుకుని కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒమిక్రాన్ భయం అందరినీ వణికిస్తోంది. ఇది డెల్టా కంటే డేంజర్ అని.. దాని కంటే చాలా వేగంగా వ్యాపిస్తుందని.. చాలా శక్తివంతమైన కరోనా వేరియంట్ అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ .. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందట. ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్న మాటలివి.


ఇలా కరోనా వేరియంట్ల వ్యాప్తిని ఆర్ వ్యాల్యూతో అంచనా వేస్తారు. అంటే ఒకరి నుంచి ఎంత మందికి ఈ వేరియంట్ వ్యాపించే శక్తి ఉందో దాన్నే ఆర్ వ్యాల్యూ అంటారు.  డెల్టా వేరియంట్‌తో  పోల్చితే ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్  ఆర్‌ వాల్యూ చాలా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. ఈ ఒమిక్రాన్ వేరియంట్.. ఇప్పటికే పవర్ ఫుల్ ట్రీట్‌ మెంట్లుగా పేరున్న  మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు కూడా తట్టుకుంటోందట. వాటికి ఏమాత్రం లొంగడం లేదట.


ఈ ఒమిక్రాన్‌ గురించి తెలుసుకోవాలంటే.. ఉన్న ఏకైక ఆధారం.. ఈ  కేసులు మొదట ఎక్కువగా  వెలుగు చూసిన దక్షిణాఫ్రికా అనుభవాలే.. అందుకే అక్కడ ఈ వేరియంట్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రాథమిక విశ్లేషణ ద్వారా తేలిందేమిటంటే.. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందట. ఈ ఒమిక్రాన్ వేరియంట్‌లో ఉన్న జీ 339డి, ఎస్‌373పి, జి496ఎస్‌, క్యూ498ఆర్‌, వై505 హెచ్‌ స్పైక్‌ ప్రొటీన్లు చాలా పవర్ ఫుల్ అట. ఇవి.. మోనోక్లోనల్‌ యాంటీ బాడీలను తట్టుకుంటాయట.


ఇప్పటి వరకూ కరోనా చికిత్సలో భాగంగా అనేక మందులు వాడాం కదా.. వాటిలో చాలా బాగా పని చేశాయని చెప్పుకున్న ఎటెసివిమాబ్‌, బామ్లానివిమాబ్‌, కసిరివిమాబ్‌, ఇండివిమాబ్‌ వంటి మందులు  ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ పై పెద్దగా ప్రభావం చూపడం లేదట. ఈ మందుల కాక్‌టెయిళ్లను కూడా ఒమిక్రాన్‌ తట్టుకుంటోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: