తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారాయి. ఎమ్మెల్సీ కోటాలో ఆరు ఎమ్మెల్సీ మాదిరిగానే స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీలకు ఏకగ్రీవం చేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ 12 స్థానాల్లో కేవలం ఆరు స్థానాల్లో ఏకగ్రీవం కాగా, మిగిలిన ఆరు స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే హుజరాబాద్ ఓటమి తర్వాత టిఆర్ఎస్ దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ను దెబ్బతీసే క్రమంలో విపరీతంగా వలసలకు ప్రయత్నాలు చేసిన టిఆర్ఎస్ ఇప్పుడు అంతర్గత పోరు తో విపరీతంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలామంది పదవులు ఆశించే వారితో  సంఖ్య పెరగడంతో అందరి పదవులను ఇయ్యడం సాధ్యం కాక, టిఆర్ఎస్ సతమతమవుతోంది. దీంతో ఆ పార్టీకి వెళ్లిన చాలా మంది నేతలు కోపంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో గట్టు రామచంద్రరావు, సర్దార్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు దూరం అయ్యారు. ఇందులో ఇంకా చాలామంది అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

వీరందరినీ తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే కేసీఆర్ సవాల్ చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన విజయాలు కూడా తన సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఒక స్థానంలో టీఆర్ఎస్ ను ఓడిస్తామని ఆయన అన్నారు. ఇది జరిగితే చాలా మంది పార్టీ వీడే అవకాశం ఉందని అధిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజాగా బీజేపీ ఇన్చార్జ్ తరుణ్   వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది. టిఆర్ఎస్ కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు 25 మంది బీజేపీతో టచ్లో ఉన్నారని అంటున్నారు. దీన్నిబట్టి రాజకీయ వర్గాల్లో పార్టీలు మారే వారి గురించి జరుగుతున్న చర్చ నిజమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తరుణ్ అంటున్నారు. దీంతో బీజేపీ ఏమైన ప్రణాళికలు వేస్తుందా లేదా సాధారణ విమర్శ అనేది ఇంకా అంతుబట్టడం లేదు. ఇప్పటికే ఢిల్లీలో కెసిఆర్ కు అపాయింట్మెంట్  దొరకకపోవడంతో  వారి విషయంలో రైతుల వ్యతిరేకమైన అంశాలు టిఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతున్న అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: