కరోనా వైరస్... ప్రపంచాన్ని వణికిస్తున్న ఏకైక వైరస్. దాదాపు రెండేళ్లుగా ప్రపంచ దేశాలన్ని కూడా కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నాయి. ఏకంగా మూడు నెలల పాటు ప్రపంచం పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. ఇప్పటికీ చాలా దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి కూడా. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరుకుంటోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.. ఈ ఏడాది జనవరి నెల 16వ తేదీ నుంచి భారతదేశ వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు వంద కోట్లకు పైగా డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు కూడా. ప్రజలంతా తమ రోజువారీ విధుల్లో పాల్గొంటున్నారు. చాలా మంది అయితే... కొవిడ్ నిబంధనలు కూడా సరిగ్గా పాటించటం లేదు. ఇదే సమయంలో ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ అంటూ వస్తున్న పుకార్లు ప్రజలను భయపెడుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ మరోసారి ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఓమిక్రాన్ భయాలు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారిలో కూడా ప్రస్తుతం ఓమిక్రాన్ భయం వెంటాడుతోంది. కొత్త వైరస్ తమకు ఎక్కడ వస్తుందో అని ప్రజలు భయపడుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఇదే ఆందోళన. ఇప్పటి వరకు ఓమిక్రాన్ వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అయినా సరే దాని లక్షణాలు గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం, వ్యాక్సిన్లు కూడా పని చేయవేమో అనే అనుమానం ఇప్పుడు అందరిలో ఉంది. విదేశాల నుంచి రాకపోకలపై ఇప్పటికే ఆంక్షలు కూడా విధిస్తున్నారు. దీంతో ఓమిక్రాన్ భయాలు మరింత ఎక్కువయ్యాయి. మరికొంత మంది అయితే థర్డ్ వేవ్ వచ్చినట్లే అని భయపడుతున్నారు కూడా. ఇప్పటికే దేశంలో చాలా మందిలో వ్యాక్సిన్లపై అపోహలు ఉన్నాయి. కేసులు కూడా తగ్గడంతో... వ్యాక్సిన్ డోసులు వేయించుకునే వారు కూడా తగ్గిపోయారు. దీంతో డబుల్ డోస్ వేయించుకున్న వారిని కూడా ఓమిక్రాన్ భయం వెంటాడుతోంది. వ్యాక్సినేషన్ పూర్తైనా తమకు కూడా ఓమిక్రాన్ సోకుతుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది.


మరింత సమాచారం తెలుసుకోండి: