కోవిడ్-19లో వైరస్ ఓమిక్రాన్ రూపంలో మానవాళిని మరింత భయపెడుతూ ముందుకు వస్తున్న నేపథ్యంలో.. జనావళిపై ఆంక్షలు పెరుగుతున్నాయి. అందరిలోనూ కనిపించని శత్రువు ఎం చేయనుందో నన్న ఆందోళన నేపథ్యంలో ఈ ఆంక్షలకు తప్పనిసరి కానున్నాయి. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రం విమాన ప్రయాణీకులపై నిఘా పెంచింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విమాన ప్రయాణీకులకు కోవిడ్-19 పరీక్షల్లో భాగమైన ఆర్టీ పిసిఆర్ పరీక్షలు నిర్వహించ నుంది. తొలుత విమానాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోకి వచ్చే ప్రయాణీకులందరికీ  ఈ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరపతి,  రాజమండ్రి విమానాశ్రయాల వద్ద ప్రత్యేక వైద్యుల బృందం ప్రయాణీకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం  తాము  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానీ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణీకులతో పాటు, దేశాయ ప్రయాణీకులకు కూడా ఈ మేరకు పరిక్షలు నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ట్లు సమాచారం. అదే విదంగా, నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లలోనూ దశల వారీగా పరీక్షలు చేయనున్నారు. కరోనా మహమ్మారి రెండో దఫా పడగ విప్పిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఈ చర్యలు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తొలుతగా విమాశ్రయాలపై దృష్టి సారించినట్లు వారు చెప్పారు.  కోవిడ్-19 తాజా దశ ఓమిక్రాన్ పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. ప్రజల్లో రేకెత్తే భయాందోళను తొలగించే ప్రయత్నం చేయనునారు.  వ్యక్తికి మరోక వ్యక్తిరి  మధ్య తప్పని సరిగా భౌతిక దూరం పాటించడం తో పాటు, మాస్కులను కూడా ధరించేలా అవగాహన  మరింత పెంచనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే చాలా ప్రాంతాలలో మాస్కుల వినియోగం తగ్గిందని  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంగీకరించారు.  కోవిడ్-19 మరో రూపంలో  ముందుకు వస్తున్న నేపథ్యంలో.. లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: