ఆనందయ్య... గుర్తుకు వచ్చారా ?  కొవిడ్-19 కొత్త వేరియంత్ ఓమిక్రాన్ కు సంబంధించిన వార్తలు వెల్లువెత్తుతున్న వేళ మరలా ఆనందయ్య ప్రసార మాధ్యమాలలో దర్శన మిచ్చారు. ఈ సారి కొత్తగా.. ఎవరూ  ఊహించని రీతిలో... ఈయన ఎంట్రీ ఎలా ఉంటుంది ? ఆయనకు మద్దతు ఇచ్చే వారెవరు ?

కోవిడ్-19 తన ప్రతాపాన్ని రెండో  దఫా  దేశంపై చూపిన వేళ, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో పడగ విప్పిన సమయంలో ఆనందయ్య  ఒక్క సారిగా వెలుగులోకి వచ్చారు. కృష్ణపట్నం వేదికగా ఆయన పంపిణీ చేసిన నాటు మందు .. అందుకోసం ఎగబడిన జన సమూహం... వారి వెంట పరుగులు తీసిన మీడియా జనంతో ఆనందయ్య కొన్నాళ్ల పాటు వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. ఆయన పంపిణి చేసే మందుకు క్యూలు కట్టారు. రాజకీయ వేత్తలు బారులు తీరారు, అధికారణం కూడా తమదైన రీతిలో పైరవీలు చేశారు. ఇక సినీ జనం సంగతి చెప్పనవసరం లేదు. ఈయన తన మందును ఆయుర్వేద మందు అని ప్రకటించుకున్నారు. మందు పంపిణీ పై  కోర్టు ప్రభుత్వాలను వివరణ కోరింది. ఈ మందు వల్ల లాభం కాని, నష్టం కానీ ఏది లేదని వైద్య నిపుణలు ప్రకటించడంతో ఆయన మందుకు పంపిణీ చేశారు. వివిధ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు ఆనందయ్య మందును తమ ప్రాంతంలో తయారి చేసి ప్రజలకు పంచి పెచ్చారు.  ఈ మందు  తయారీలో రాజకీయవేత్తలు చూపిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. దీంతో కొన్ని జిల్లాలలో ఒకే పార్టీలోని రెండు వర్గాల మధ్య విబేధాలు కూడా రాజుకున్నాయి. వైద్. రంగ నిపుణులు ఈ మందు ఆయుర్వేదం పరిధిలోకి రాదని, కేవలం నాటు మంది అని ప్రకటించారు. కోరోనా ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ఆనందయ్య మందుకు కూడా గిరాకి తగ్గింది. జనాల్లో మునపతి ఉత్సాహం కూడా తగ్గింది. కరోన్ మందు పంపిణీ చేసిన తరువాత ఆనందయ్య గత కోంత కాలంగా ఎక్కడ ఉన్నారు ? ఎం చేస్తున్నారు అన్న విషయం ఎవరికీ తెలియాదు.  దాదాపుగా జనం ఆయన్ని మర్చిపోయారు. కానీ ఆయన తిరిగి  వార్తల్లోకి ఎక్కారు.  రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు.
 బీసీలను ప్రస్తుతం చిన్న చూపు చూస్తున్నరని ఆయన విశాఖ ట్నం లో  ప్రకటించారు. ప్రస్తుతం
ఈయనకు మద్దతుగా నిలిచేది ఎవరు ?   అన్న ప్రశ్న తలెత్తుతోంది.  ఆనందయ్య తాజా గా  రాజకీయ ప్రకటన చేయకముందు కూడా ఇటువంటి వార్తలు హల్ చల్ చేశాయి.  ఆయన మందుకు పంపిణీ ఆంభించిన సమయంలో భారతీయ జన తాపార్టీ కి అనుబందంగా ఉన్న సంస్థలు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాయి. అప్పడు ఆయన మా పార్టీకి  సానుభూతి పరుడు అని కొన్ని పార్టీలు ప్రచారం చేసుకున్నాయి. ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వై.ఎస్.అర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనకు మద్దతు గా నిలిచారు. దీంతో అనధికారికంగా అధికార పార్టి సభ్యుడిగా ఉన్నారు.  అయితే తాజాగా ఆనందయ్య తాను కొత్తగా రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు.  అదే సమయంలో కోవిడ్-19 కోత్త వేరియంట్ ఓమిక్రాక్ కు తన వద్ద మందుకు ఉందని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: