సమైక్య రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా ఎప్పుడూ తన ఆధిపత్యం నిలుపుకుంటూ వచ్చేది. ఆ మాటకు వస్తే రాజకీయంగా మాత్రమే కాదు విద్యా - వైద్య - పారిశ్రామిక రంగాలలో కూడా కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నత స్థానాల్లో నిలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టాక సమైక్య రాష్ట్రంలో రాజకీయంగా క‌మ్మ వ‌ర్గం కీలక పాత్ర పోషించింది.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ న‌గర్ వరకూ ఉన్న క‌మ్మ‌లు అందరూ రాజకీయంగా ముందుకు వచ్చారు. వీరంతా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. అయితే క‌మ్మ నేతలు ఎక్కువగా గుంటూరు జిల్లా రాజకీయాలను శాసిస్తున్న వచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గుంటూరు జిల్లా వరకు క‌మ్మ నేతల రాజకీయం కొనసాగుతూ వచ్చేది. తెలుగుదేశం పార్టీ కావచ్చు ... ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచిన కూడా గుంటూరు వరకు క‌మ్మ హ‌వానే ప్రధానంగా ఉండేది.

జగన్ వైసిపి పెట్టిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో కూడా గుంటూరు జిల్లాలో ఐదుగురు క‌మ్మ నేత‌ల‌కు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గత ఎన్నికల్లో కేవలం ముగ్గురు క‌మ్మ నేత‌ల‌కు మాత్రమే సీట్లు ఇచ్చారు. వైసీపీ గెలిచాక‌ గుంటూరులో క‌మ్మ‌లు పూర్తిగా రాజకీయంగా వెనుకబడి పోయారు. అయితే ఇప్పుడు తిరిగి క‌మ్మ నేత‌లు లీడ్ లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

తెలుగు దేశంలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు - ఆలపాటి రాజా తో పాటు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు - కొమ్మాలపాటి శ్రీధర్ - ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ - య‌రపతినేని శ్రీనివాసరావు - రాయపాటి , కోడెల ఫ్యామిలీ లు బాగా యాక్టివ్ అవుతున్నాయి. వీరి దూకుడు చూస్తుంటే వచ్చే ఎన్నికల తర్వాత మరోసారి గుంటూరు లో క‌మ్మ రాజకీయ హ‌వా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: