మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సమాజంలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేటుగాళ్లు కష్టపడకుండా చాలా సింపుల్ గా ఎలా డబ్బులు సంపాదించాలని ప్లాన్లు వేస్తున్నారు. ఈ కేటుగాళ్ల వలలో పడి ఎంతో మంది సాధారణ , మధ్యతరగతి పేద ప్రజలు నష్టపోతున్నారు. తాము సంపాదించిన సొమ్మును ఈ మాయ గాళ్ళ వ‌ల‌లో పడి వారికి సమర్పించుకున్నారు. చివరకు ఈ కేటుగాళ్ళు సామాన్య ప్రజలు నే కాకుండా ఉన్నత విద్యావంతులను , సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు... చివరకు రాజకీయ నాయకులను ఎమ్మెల్యేలను , మంత్రులను, ఎంపీల‌ను కూడా మోసం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను మంత్రులనే మాటలతో నమ్మించే బురిడీ గాళ్ళు ఉన్నారంటే సమాజంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ? అర్థం అవుతోంది.

ఇప్ప‌టికే ఈ కేటుగాళ్ల మాయ‌లో ప‌డి ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మోస‌పోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా మాయ‌గాళ్లు, కేటుగాళ్ల బురిడీ మాట‌ల‌కు ప‌డిపోయిన రాజ‌కీయ నాయ‌కుల‌ను చూస్తూనే ఉన్నాం. తాజాగా హై ద‌రాబాద్ కు చెందిన శిల్పా చౌద‌రి దంప‌తులు కిట్టీ పార్టీల పేరుతో పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ నేత‌ల‌ను ఎలా వ‌ల‌లో వేసుకున్నారో ?  ఎలా రు. 200 కోట్ల‌కు ఎగ‌నామాలు పెట్టారో ?  మ‌నం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఓ కేటుగాడి వ‌ల‌లో అధికార వైసీపీ కి చెందిన మ‌హిళా ఎమ్మెల్యే ప‌డ‌బోయి తృటిలో త‌ప్పించుకున్నారు. గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ ని ఓ మోస‌గాడు కోవిడ్ నిధుల పేరుతో టోక‌రా వేయ‌బోయాడు. తాను సీఎం వో కార్యాల‌య ఉద్యోగిని అని చెప్పుకున్న స‌ద‌రు మోస‌గాడు బాలాజీ ని ఎమ్మెల్యే ను న‌మ్మించ బోయాడు.

కోవిడ్ నిధులు కేంద్రం నుంచి రు. 2 కోట్లు వ‌స్తాయ‌ని ఎమ్మెల్యే ను న‌మ్మించి మోసం చేసేందుకు ప్లాన్ వేశాడు. అయితే అనుమానం వ‌చ్చిన ఆమె వివ‌రాలు ఆరా తీస్తే అదేం లేద‌ని తేలింది. అయితే బాలాజీ పై గ‌తంలోనే గుంటూరు న‌గ‌రంలోని ప‌ట్టాభిపురం పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. నిందుతుడు బాలాజీకి ఎక్సైజ్ కోర్టు యేడాది జైలు శిక్ష తో పాటు రు. 1000 జ‌రిమానా విధించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: