ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు చిరకాలంగా ... రాజకీయపరంగా శత్రువులుగా ఉన్న వారిపై తనదైన స్టైల్లో రివేంజ్ తీర్చుకుంటూ వస్తున్నారు. తన తండ్రి తో పాటు తనకు రాజకీయంగా బద్ధశత్రువుగా ఉన్న చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. చివరకు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పట్టు కోసం ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబును ఎమ్మెల్యే గా ఓడించాలని జగన్ చేసిన ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయింది. తక్కువ మెజార్టీతో చంద్రబాబు బయటపడ్డారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ జెండా ఎగిరింది. ఇక ఇప్పుడు కడప జిల్లాలో తన తండ్రికి రాజకీయంగా శత్రువులుగా ఉన్న వారి భ‌ర‌తం కూడా జగన్ పడుతున్నారు.సీనియర్ నేత మైసూరా రెడ్డి గతంలో వైసిపి లో ఉన్న తర్వాత బయటికి వెళ్లారు. ఇప్పుడు ఆయనను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టారు జగన్. ఆయన తనయుడి కి ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

ఇక వైఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించిన మరో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపిలో ఉన్నా ఆయన చేయడానికి ఏం లేదు. ఇక జ‌మ్మ‌ల మ‌డుగు నియోజకవర్గానికి చెందిన మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో ఉన్నా ఆయన చేతులు పూర్తిగా కట్టేశారు. ఇక మరో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కూడా ముందు నుంచి వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా ఉండేవారు.

ఇప్పుడు ఆయన వైసీపీ సానుభూతిపరులు గా ఉన్నా కూడా  ఏ ప‌ద‌వి ఇవ్వలేదు. దీంతో డీ ఎల్ కూడా ఇప్పుడు లోలోన రగిలిపోతూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు తన తండ్రి ... ఆ తర్వాత తనను వ్యతిరేకించిన రాజకీయ శత్రువుల అందరినీ జగన్ రాజకీయంగా ప‌త‌నం చేస్తూ వస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: