తెలంగాణ రాష్ట్రంలోని  కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడిప్పుడే కాస్త ఊపు కనిపిస్తోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందనే చెప్పాలి . ఇప్పుడిప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా .. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా మ‌హ‌బూబ్‌ నగర్ , గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన సీనియర్ నేతలు సైతం హ‌స్తం గూటికి చేరుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దింపాలని రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీ కాంగ్రెస్లో అసమ్మతి వాదులు గా పేరున్న సీనియర్ నేతలను కూడా రేవంత్ రెడ్డి కలుపుకుని వెళుతున్నారు. ఇదిలా ఉంటే టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ గా ఉన్నారు. ఇక ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అయినట్టే. వచ్చే ఎన్నికల్లో ఆయన వార‌సులు ఇద్ద‌రూ పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

తన సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్ తోపాటు మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలనే ఆలోచన జానా ఇద్ద‌రు వార‌సులు చేస్తున్నారు. సొంత నియోజ‌క వ‌ర్గం నాగార్జున సాగర్లో జైవీర్ , మిర్యాలగూడలో రఘువీర్ పోటీ చేయాలని .... తమ ఇద్దరికీ రెండు టికెట్లు కావాలని కొత్త డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు.

నాగార్జున సాగర్ టికెట్ జానారెడ్డి ఫ్యామిలీకి కేటాయించే విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అయితే మిర్యాలగూడ లో కూడా కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు. అక్కడ కూడా జానారెడ్డికి మంచి పట్టు ఉంది. జానారెడ్డి వారసుడు అయితేనే అక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతాడ‌ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం భావిస్తే.. ఇద్దరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: