రాజ‌కీయం వ్యాపారం అన్న‌వి రెండు క‌ళ్లుగా చేసుకుని సాగిపోతుండ‌డం ఓ విశేషం. వైద్య రంగం కూడా ఓ త‌ర‌హా వ్యాపార‌మే క‌ను క  ఆధునిక వైద్య వ‌స‌తుల‌ను వినియోగించుకుని ఇప్పుడు ఎక్క‌డికక్క‌డ వ్యాధి నిర్థార‌ణ కేంద్రాలు (డ‌యాగ్నోసిస్ సెంట‌ర్) వెలు స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ వేత్త‌లు ఇటుగా అడుగులు వేస్తున్నారు. త‌మ బిడ్డ‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించేక ఇటుగా  వ్యాపార రంగంలో స్థిర‌ప‌డేందుకు ఉన్న అవ‌కాశాలు ఏ మాత్రం వ‌దులుకోవ‌డం లేదు. ఇప్ప‌టికే ధ‌ర్మాన కృష్ణ దాసు పెద్ద కొడుకు ధ‌ర్మాన రామ‌లింగం నాయుడు రియ‌ల్ట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే వైద్య విద్య అభ్యాసం అనంత‌రం హైద్రాబాద్ లో కొంత కాలం ప్రాక్టీసు చేసిన అనంత‌రం ఇక్క‌డికి చేరుకున్న కృష్ణ చైత‌న్య తన నేతృత్వాన వీటికి రూపుదిద్దేలా ప్రణాళిక‌లు వేశారు.

అప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మాయ‌న ఈ డయాగ్నోసిస్ సెంట‌ర్ శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంగా మంచి డ‌బ్బులు చూసింద‌ని టాక్. అదే స‌మ‌యంలో విశాఖ కేంద్రంగా ఉన్న కృష్ణా మెడిక‌ల్ సెంట‌ర్ కూడా క‌రోనా విష‌య‌మై వ్యాధి నిర్థార‌ణ‌కు ఎక్కువ మొత్తంలోనే ఫీజులు వ‌సూలు చేసింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే డిప్యూటీ సీఎం మెడిక‌ల్ సెంట‌ర్ కావ‌డంతో ఎవ్వ‌రూ నోరెత్త‌లేక‌పోయారు. ముఖ్యంగా క‌రోనా నిర్థార‌ణ‌కు కీల‌కంగా మారిన సిటీ స్కాన్ విష‌య‌మై ఇక్క‌డి రెండు సెంట‌ర్ల‌కు మంచి డిమాండ్ వ‌చ్చింది. దీంతో వ్యాపారం బాగానే సాగిపోయింది. ఆ ఉత్సాహంతోనే కొత్త స్కాన్ సెంట‌ర్ ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు షురూ చేసి రాజాంలో దీనిని నిన్న‌టి వేళ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు.

ఇంకా చెప్పాలంటే...  
డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాసు వ‌రుస‌గా వ్యాపార రంగాన్ని విస్తృతం చేసే ప‌నిలో ఉన్నారు. ఈ సారి రాజాం కేంద్రంగా వ్యాపారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కృష్ణా మెడిక‌ల్ సెంట‌ర్ పేరిట రాజాంలో వ్యాధి నిర్థార‌ణ కేంద్రాన్ని ప్రారంభించారు. క‌రోనా స‌మ‌యంలో రెండు మెడిక‌ల్ సెంట‌ర్లు ప్రారంభించిన ధ‌ర్మాన కృష్ణ దాసు మ‌రో వైద్య కేంద్రం ఏర్పాటుకు త‌క్కువ స‌మ‌యంలోనే సిద్ధం అయ్యారు. ఓ వైపు రాజ‌కీయం మ‌రో వైపు వైద్య రంగం కేంద్రంగా వ్యాపారం ఇలా రెండు రంగాల్లోనూ ఆయ‌న జోడెద్దుల బండిని బాగానే న‌డుపుతున్నారు. దీపం ఉండ‌గానే ఇల్లు దిద్దుకుంటున్నారు. త్వ‌ర‌లో ప‌లాస కేంద్రంగా కృష్ణా మెడిక‌ల్ సెంట‌ర్
(డ‌య‌గ్నోసిస్ సెంట‌ర్) ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. వీటి నిర్వ‌హ‌ణను కూడా ఆయ‌న చిన్న కుమారుడు, రేడియాలజిస్ట్ డాక్ట‌ర్ కృష్ణ చైత‌న్య చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp