చైనా విస్తరణ వాదా ధోరణితో వ్యవహరిస్తు ఎప్పుడూ ఇతర దేశాలకు సంబంధించిన భూభాగాలను తమ దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వన్ చైనా పాలసీ తోనే ముందుకు సాగుతూ ఉంటుంది అక్కడి ప్రభుత్వం. ఈ క్రమంలోనే మంగోలియా, టిబెట్, హాంకాంగ్ లాంటి ఎన్నో స్వతంత్ర దేశాల ను ఇప్పటికే చైనా తమ దేశంలో కలుపుతుంది. అదే సమయంలో ఇక చైనా పొరుగుదేశమైన తైవాన్ ను కూడా స్వాధీనం చేసుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తోంది.  గత కొన్ని రోజుల నుంచి తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.




 అదే సమయంలో ఇక భారత సరిహద్దుల్లో కూడా భూభాగాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది చైనా. ఇలా ఎప్పుడూ విస్తరణ వాద ధోరణితో వ్యవహరిస్తోందని ఉంటుంది. అయితే ఇది ఒకరకం విస్తరణ వాద ధోరణి అయితే ఇక అటుప్రపంచ దేశాల విషయంలో మరొక రకం విస్తరణ వాద ధోరణితో చైనా ముందుకు సాగుతుంది అన్న విషయం ఇటీవలి కాలంలో తెలుస్తోంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశాలకు భారీగా అప్పులు ఇవ్వడం.. ఇక ఎక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చి చివరికి ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఇతర దేశాలకు సంబంధించిన భాగాలను స్వాధీనం చేసుకోవడం చేస్తుంది.



 ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలకు ఇలా ఆర్థిక సహాయం పేరుతో తమ వైపు తిప్పుకోవడానికి ఇతర దేశాలకు సంబంధించిన భూభాగంపై కూడా ఆధిపత్యం సాధించింది చైనా. ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా ఇలాంటి వ్యూహాన్ని చైనా అమలు చేస్తోన్నట్లు అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు చైనా ట్రాప్ లో పడిన దేశాలలో ఆఫ్రికా కంట్రీస్ కు చెందిన ఉగాండా కూడా ఉంది. ఇక ఆర్థిక సహాయం పేరుతో ఎన్నో అప్పులు ఇచ్చింది. ఇక ఇప్పుడు అప్పులు తీరక పోవడంతో ఏకంగా ఒక విమానాశ్రయాన్ని ఉగాండా చైనాకు అప్పజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ విషయం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: