తెలంగాణ రాష్టంలో టి.ఆర్ ఎస్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రైతుల పరిస్థితులు గందరగోళంగా మారిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
తెలంగాణలో  రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని.. నాసి రకం విత్తునల అమ్మకాలు అరికట్టడంలో కూడ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు కిషన్ రెడ్డి. కౌలు సహాయం ఎవరికి అందడం లేదు...రైతు బంధు,రుణమాఫీ కావొచ్చు.. కేసీఆర్ మొండి వైఖరి,నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసం పోతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.  ప్రతి ఏడాది మే నెలలో ఏ ఏ పంటలు వేసుకోవాలి ఎంత సాగు చేసుకోవాలో చెప్తారని.. టి ఆర్ ఎస్ వచ్చిన తర్వాత పంటల ప్రణాళికలు లేవు, కేసీఆర్ ప్రణాళిక మాత్రమే ఉందన్నారు కిషన్ రెడ్డి. పంటల పై ప్రభుత్వానికి సిరమైన అవగహన లేక గందొరగోలమైన పరిస్థితి ఏర్పడిందని.. హుజరుబాద్ ఓటమి, సంజాయ్ పాదయాత్ర కేసీఆర్ ని నిద్ర పోనివ్వడం లేదన్నారు కిషన్ రెడ్డి.


హుజరుబాద్ ఓటమి గోస పార్లమెంట్ చేరుకుందని,,, కేసీఆర్,కేసీఆర్ కుటుంబం పై సానుభూతి తప్ప మేము చేసేది ఏమీ  లేదని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.   రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ ఇవ్వమని కేంద్రానికి లేఖ రాశారు... బాయిల్డ్ రైస్ విత్తనాల బదులు,రా రైస్ వచ్చే విధానానికి ఏమైనా చేశారా....? అని నిలదీశారు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశ్నిస్తున్న... కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బియ్యం కొనమని చెప్పలేదని అగ్రహించారు కిషన్ రెడ్డి.  పుత్రవత్సల్యం పార్లమెంట్ కు చేరుకుంది... కొడుకు ముఖ్యమంత్రి అవుతాడో లేదో అని భయం తో చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి.  రైతుల జీవితాలతో ఆడుకోకండీ... బీజేపీ రైతులకు అండగా ఉంటుందన్నారు కిషన్ రెడ్డి.  టి.ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫుడ్ సెక్యూరిటీ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్.సి ఐ అమ్మలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: