సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే

పగలైనా వెలుతురు వస్తుందా..

జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే

రాతిరేళ వెన్నెల కాస్తుందా
నా లాల‌న నిను చేరేనా ఏనాటికైనా ఓ ప‌సికూన
ఆడిందే ఆటంటే పాడిందే పాటంట ఆపేందుకు అమ్మానాన్నా లేరంట‌!


అమ్మా నాన్న‌లు లేని లోటు చెప్పాలి.. అలా అని బాధ‌తో కాదు కాస్త అనున‌యంగా చెప్పాలి.. అమ్మా నాన్నుంటే అమ్మ‌మ్మో ఇబ్బందే కాస్త‌యినా అల్ల‌రి చేసే వీల్లేదే.. ఈ మాట ఎన్నిసార్ల‌యినా పాడుకోవాలి.. ఎన్ని సార్లు అయినా అమ్మా నాన్న‌లు లేని లోటును ప్ర‌కృతి  ఏ విధంగా స‌మం చేస్తుందో లేదా భ‌ర్తీ చేస్తుందో చెప్ప‌గ‌ల‌గాలి.. అలాంటి పాట అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా..... అంటూ సింహాద్రి సినిమాకు పాట రాశారాయ‌న. ఈ పాట విని చ‌దివి పొంగిపోయాను అని అంటున్నారు రాజ‌మౌళి.. సిరివెన్నెల‌కు నివాళి ఇస్తూ..

ఈ పాట క‌న్నా ముందు అత‌డి జీవితం గురించి చెప్పాలి..అప్ప‌టికే 1966లో అర్ధాంగి సినిమాతో  మేం సంపాదించుకున్న‌దంతా పోగొట్టుకున్నాం. వ‌చ్చే నెల ఇంటి అద్దె ఎంత క‌ట్టాలో తెలియ‌ని ప‌రిస్థితి. అలాంటి వేళ కూడా ఎప్పుడూ ఒప్పుకోకు ఓట‌మి అని సిరివెన్నెల రాసిన పాటే మాకు స్ఫూర్తి ఇచ్చింది. ఆ పాట లో లైన్లు పాడుకుంటే  ఎక్క‌డా లేని ధైర్యం వ‌చ్చేది. చెన్న‌య్ లో ఉండ‌గాఓ రోజు ఓ డిసెంబ‌ర్ 31న రాత్రి ప‌ది గంట‌ల‌కు ఆయ‌న ఇంటికి వెళ్లి కొత్త నోటు పుస్త‌కం ఒక‌టి ఇచ్చి నాకు న‌చ్చిన ఈ పాట రాయ‌మ‌ని చెప్పాను.. ఆ పుస్త‌కంలో.. ఆయ‌న త‌న స్వ‌ద‌స్తూరితో రాసి ఇచ్చారు.. ఆ పాట చ‌దివి నాన్న‌కు ఆ పుస్త‌కం ఇచ్చాను. ఆయ‌నెంతో పొంగిపోయారు. ఆయ‌న క‌ళ్ల‌లోఆనందం కొత్త‌గా ఎగ‌ద‌న్నుకొచ్చిన విశ్వాసం ఎప్ప‌టికీ మ‌రువ‌ను అంటూ చెప్పారు రాజ‌మౌళి. సింహాద్రి సినిమాకు సంబంధించి పాట రాసిన‌ప్పుడు కూడా ఐ లవ్ ఛాలెంజెస్ అని  అంటూనే పాట రాశారు. మ‌ర్యాద రామ‌న్న‌కు ప‌రుగులు తియ్ పాట రాశారు. అవి చాలా ఇష్టం. ఆర్ఆర్ఆర్ కు దోస్తీ పాట రాశారు.ఆయ‌న సంతకం పెడుతున్న షాట్ తీద్దాం అనుకున్నాం కానీ ఆయ‌న ఆరోగ్యం అప్ప‌టికే స‌హ‌క‌రించ‌లేదు. నా జీవ‌న గ‌మానాన్ని నిర్దేశించిన సిరివెన్నెల క‌లానికి శ్ర‌ద్ధాంజలి అని చెప్పారు... ఓ ప్ర‌క‌ట‌న‌లో..




మరింత సమాచారం తెలుసుకోండి: