సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒకేసారి మంత్రివర్గాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోదు. దశల వారీగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. అలాగే మధ్య మధ్యలో పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తారు. కానీ ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం అలా చేయలేదు. ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని..మళ్ళీ రెండున్నర ఏళ్ళకు మంత్రివర్గంలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చెప్పేశారు.

ఇక జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అయిపోయింది...అంటే మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సమయం ఆసన్నమైందనే చెప్పొచ్చు. అయితే 100 శాతం మార్పులు చేస్తారా? లేక కొంతమందిని మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అదే కాదు మంత్రివర్గంలో మార్పులు ఎప్పుడు చేస్తారో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్తితులని బట్టి చూస్తే...మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి ఎలాంటి హడావిడి జరగడం లేదు. దాని గురించి చర్చలు కూడా నడవటం లేదు.

అంటే మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే మధ్యలో చాలా సమయం కరోనాకు పోయింది...దీంతో మంత్రులు తమ పనితీరుని నిరూపించుకోవడానికి సమయం సరిపోలేదు. కాబట్టి జగన్‌ని మరో ఆరు నెలలు అవకాశం ఇవ్వాలని మంత్రులు కోరినట్లు తెలుస్తోంది. దానికి జగన్ కూడా ఓకే చెప్పి...మంత్రివర్గాన్ని మూడేళ్ళ పాటు కొనసాగించేలా ఉన్నారు.

 
అయితే మార్పులు ఎప్పుడు చేసినా సరే 100 శాతం మార్పులు మాత్రం జరిగే పరిస్తితి కనిపించడం లేదు. కొందరు మంత్రులని జగన్ కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. కొందరికి ఐదేళ్ల పాటు కొనసాగే ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొందరు మంత్రులని తప్పిస్తే రాజకీయంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే కొంతమంది సీనియర్ మంత్రులని జగన్ ఐదేళ్ల పాటు తన మంత్రివర్గంలో కొనసాగించనున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఇంకా మంత్రివర్గంలో ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: