తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని నెలల నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ  ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా  వారి వారి పార్టీల బలాలు పెంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడున్నర సంవత్సరాల నుంచి  తెరాస పార్టీకి కనీసం ప్రతిపక్షాల తరఫున ప్రశ్నించే వారు ఎవరు లేకుండా పాలన కొనసాగించింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది అని చెప్పవచ్చు. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి, ఇంకొకవైపు బిఎస్పి, షర్మిల పార్టీ  ఇలా అన్ని పార్టీల నుంచి పదునైన  కత్తుల్లా తెరాస పార్టీపై, ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఈ సందర్భంగానే తెరాస నుంచి ఈటల రాజేందర్ బయటకు రావడం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం దీంతో బిజెపి ఎలాగైనా తెలంగాణలో పట్టు సాధించాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అలాగే కొత్తగా  టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్లో కొత్త జోష్ తో ముందుకు పోతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో  రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య పోరు తీవ్రంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇవి గమనిస్తున్నమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రంల్లో తన మార్కు సంపాదించుకునేందుకు పావులు కదుపుతోంది. కేవలం పశ్చిమబెంగాల్ కే పరిమితం కాకుండా  గోవా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ మరియు దేశవ్యాప్తంగా  వారి పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో పడ్డారని సమాచారం. ఈ దిశగానే  ఆమె కన్ను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై పడింది. ఇందులో భాగంగానే తెలంగాణలోని కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలతో, మరియు టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలతో  మంతనాలు జరిపేందుకు జాబితా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలతో ఆమె మాట్లాడినట్టు  సమాచారం. దీంతో అసంతృప్తి నేతలంతా మమత వైపు తిరిగే అవకాశం ఉందని పొలిటికల్ టాక్.  ఈ దిశగానే ఆమె తెలంగాణలోని పార్టీ రాజకీయ పరిస్థితులు, బలాలు మరియు బలహీనతలు వంటివాటిపై  దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కు జాతీయస్థాయిలో  వెనక నుంచి పని చేస్తున్నటువంటి ఒక సంస్థకి ఈ యొక్క బాధ్యత అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ ఏజెన్సీ తెలంగాణలో కాంగ్రెస్ టిఆర్ఎస్ ల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని  దీధీకి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: