ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక తెలంగాణ అన్ని రంగాల్లోనూ దూసుకు పోతూ ఉంది. అయితే విమానయాన రంగ పరంగా తెలంగాణ కాస్త వెనుకంజలోనే ఉంద‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏకైక పెద్ద విమానాశ్ర‌యం ఒక్క హైద‌రాబాద్ లో మాత్ర‌మే ఉంది. శంషాబా ద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు మాత్ర‌మే తెలంగాణ కు గుండెకాయ లాంటిది. అయితే ఇప్పుడు ప‌లు జిల్లా ల్లో విమానాశ్ర‌యాలు ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే మ‌రీ పెద్ద స్థాయిలో కాకుండా మీడియం రేంజ్ విమానా శ్ర‌యాలు ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ స్టేట‌స్ ను మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. టీఆర్ ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు రాజ్య‌స‌భ‌లో కేంద్ర విమాన యాన శాఖా మంత్రి వీకే సింగ్ స‌మాధానం ఇచ్చారు. తెలంగాణ లో ఏర్పాటు చేస్తోన్న విమానాశ్ర‌యాల వివ‌రాలు వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ - వరంగల్ జిల్లా మామునూరు లో నూ.. అలాగే పెద్దపల్లి జిల్లా బసంత్ న‌గర్ - ఆదిలాబాద్ తో పాటు - మహబూబ్ న‌గర్ జిల్లాలో మూడు బ్రౌన్ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు పంపినట్టు కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పారు.

ఇక వీటితో పాటు హైద‌రాబాద్ లో ఉన్న శంషాబాద్ ఎయిర్ పోర్టు విస్త‌ర‌ణ 2022 డిసెంబర్ వరకు పూర్తవుతుందని కేంద్రమంత్రి వీకే సింగ్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఇక్క‌డ విస్త‌ర‌ణ పూర్త‌య్యాక ప్ర‌యాణికుల సామ‌ర్థ్యం ఏడాది 1.24 కోట్ల నుంచి 3.24 కోట్ల‌కు చేరుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణ లో ఈ కొత్త ఆరు ఎయిర్ పోర్టులు కూడా వ‌స్తే అప్పుడు విమాన యాన ప‌రంగా మ‌రింత అభివృద్ధి జ‌రుగుతుంద‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: