ఉత్త‌రాంధ్ర లోని విశాఖపట్నంలో రాజకీయం ఊహించని విధంగా మారుతున్నాయి. మొన్నటివరకు వైసీపీకే అనుకూలంగా పరిస్తితులు ఉన్నాయ‌ని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు చెప్పేశాయి. అయితే ఇప్పుడు అక్క‌డ రాజ‌కీయం కాస్త మారుతోన్న ప‌రిస్థితి అయితే ఉంది. వైసీపీ పై జిల్లా లో  కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. విశాఖలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో సగం ఎమ్మెల్యేల వరకు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటోన్న ప‌రిస్థితి ఉంద‌నే చెప్పాలి. సాధార‌ణ జ‌నాల్లో కూడా వీరిపై వ్య‌తిరేక‌త  క‌నిపిస్తోంది.

చాలా మందిలో సీఎం జ‌గ‌న్ పై కొంత సానుకూల అభిప్రాయం ఉన్నా కూడా .. ఎమ్మెల్యేల తీరు తో చాలా నియోజ‌క‌వ‌ర్గా ల్లో పార్టీ ఓడిపోయే ప‌రిస్థితి రెండున్న ర సంవ‌త్స రాల‌కే వ‌చ్చేసింది. ఏజెన్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీకి అంత అనుకూలమైన స్థితి క‌న ప‌డ‌డం లేదు. ఇక ఆమె కు అక్క‌డ యాంటీ వాతావ‌ర‌ణం అప్పుడే వ‌చ్చేసింది. ఆమె ఎమ్మెల్యే అయిన ఈ రెండున్నర ఏళ్లలో ఆమె పాడేరులో చేసిన అభివృద్ధి ప‌నులు ఏమి లేవు. దీంతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి దీనిని క్యాష్ చేసుకోలేక పోతున్నారు.

ఇక మ‌రో ఏజెన్సీ నియోజ‌వ‌క‌ర్గం అయిన‌ అరకులో కూడా వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉంది. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ చేసిందేమి లేక‌పోయినా అక్క‌డ టీడీపీ అడ్ర‌స్ లేక‌పోవ‌డం మైన‌స్‌. గ‌త ఎన్నిక‌ల్లో మంత్రి ఉండి డిపాజిట్లు కోల్పోయిన కిడారి శ్ర‌వ‌ణ్‌ను ఇక్క‌డ త‌ప్పిస్తే త‌ప్పా ఇక్క‌డ వైసీపీ పై వ్య‌తిరేక‌త టీడీపీ క్యాష్ చేసుకునే ప‌రిస్థితి లేదు.

ఇక మాడుగుల లో బూడి ముత్యాల నాయుడు త‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేద‌ని కేడ‌ర్‌, నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించు కోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక చోడ‌వ‌రం లో క‌ర‌ణం ధ‌ర్మ శ్రీ ది కూడా అదే ప‌రిస్థితి. అయితే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ త‌ర‌పున నాయ‌కులు స్పీడ్ మూమెంట్ చేయ‌క‌పోవ‌డంతో పార్టీకి మంచి ఛాన్సులు ఉన్నా వాడుకోవ‌డం లేదు. ఏదేమైనా వైసీపీ పై వ్య‌తిరేక‌త‌ను కూడా ఇక్క‌డ టీడీపీ క్యాష్ చేసుకోలేక పోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: