తెలంగాణ ఆర్టీసీ 9,750 బస్సులను 3080 రూట్లలో నడిపిస్తున్నాం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రోజు 33 లక్షల కిలో మీటర్లు తిరుగుతున్న బ‌స్సులు 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు తరలిస్తున్నామ‌న్నారు. గతంలో ప్ర‌తి కిలోమీట‌రుకు 20 పైసలు అన్ని బస్సులకు పెంచడం జరిగింద‌ని.. కానీ, ఆ డబ్బులు ఆర్టీసీ కి చేరలేదని వివ‌రించారు ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌. మార్చ్ నుండి కరోనా.. ఆ తరువాత వచ్చిన క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటుంది అని అన్నారు.


  క‌రోనా స‌మ‌యంలో బ‌స్సులు న‌డ‌ప‌డం వ‌ల్ల 251 మంది ఆర్టీసీ సిబ్బంది మరణించారు అని గుర్తు చేసుకున్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయి.. లీట‌ర్ డీజీలో గ‌తంలో 63.8 రూపాయ‌లు ఉండేద‌ని.. ఇప్పుడు 87 రూపాయలు చేరింద‌ని.. 27 రూపాయలు అధికంగా పెరిగింది అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు స్పెర్ పార్ట్స్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయ‌ని చెప్పారు. ఈ సంవత్సరం  ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు 1400 కోట్ల రూపాయ‌లు నష్టం వచ్చింది అని పేర్కొన్నారు.


దీంతో చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతం లో విజ్ఞప్తి చేశామ‌ని.. ఇప్పుడు కూడా మంత్రి ద్వారా కోరుతున్నామ‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు. పల్లెవేలుగు, ఆర్డినరి బ‌స్సుల‌కు ప్ర‌తి కిలోమీట‌ర్‌కు 25 పైసలు.. రాజధాని , ఎక్స్ ప్రెస్, గరుడ సర్వీసులకు లకు ప్ర‌తి కిలోమీట‌ర్‌కు 30 పైసలు పెంచాలని తాము ప్రతిపాదనలు పెట్టామ‌ని వివ‌రించారు. ఆర్టీసీకి రోజుకు 14 కోట్ల ఆదాయం వరకు వస్తుంద‌ని.. చార్జీలు పెరగడం వల్ల ఆర్టీసీ మళ్ళీ నార్మల్ ప‌రిస్థితికి వస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు.



మూడు నెలల్లో 590 ట్రిప్పులు కొత్తగా తిప్పుతున్నామ‌ని.. ఇత‌ర‌ రాష్ట్రాలకు కూడా బస్సులు నడుపుతున్నామ‌ని చెప్పారు. జోగులంబ, కాళేశ్వరం, భద్రాచలం లాంటి ముఖ్య ప్రాంతాలకు బస్సులు  నడుపుతున్నామ‌న్నారు.. అన్ని ధరలు పెరిగాయి దీని వ‌ల్ల చార్జీలు కూడా పెంచండి అని ఆర్టీసీ ఎండీ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యాన్ని ముఖ్యమంత్రి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్టీసీ యాజమాన్యం తరుపున విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు ఎండీ స‌జ్జ‌నార్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: