చైనా గతంలో భారత్ పై ప్రయోగించిన వ్యూహాన్ని తైవాన్ పై అమలు చేయాలని భావిస్తుంది. గతంలో భారత్ పై యుద్దానికి వచ్చినప్పుడల్లా కొంత భూభాగాన్ని ఆక్రమించటం, అంతటితో యుద్ధం ఆపేయడం చేస్తుండేది. అలా 90వేల కిమీ. ఆక్రమించింది. దానిలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత లఢక్ సందర్భంలో 30కిమీ స్వాధీనం చేసుకుంది. ఇదే తరహాలో తైవాన్ ను కూడా కొద్దికొద్దిగా ఆక్రమించేందుకు చైనా పన్నాగాలు పన్నుతోంది. తద్వారా పెద్దగా అంతర్జాతీయంగా ప్రతిఘటన ఉండబోదని దాని ఉద్దేశ్యం. ఒకవేళ చైనా ఈ వ్యూహంలో కూడా అంతర్జాతీయ సమాజం పట్టించుకోని, చైనా కు అడ్డుపడితే అంతా బాగున్నట్టు. అలా జరగాలంటే, మళ్ళీ ఆయా దేశాలు చైనా మీదకు యుద్దానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇలాంటి వ్యూహాలు చైనా కు సహజమే అయినప్పటికీ, అది ఆయా దేశాలను రెచ్చగొట్టి, యుద్ధ వాతావరణం లేవనెత్తాలని చూస్తుంది. బహుశా ఈ వ్యూహం కూడా అందులో భాగం కావచ్చు. కాస్త భూభాగం పోతే పోయింది, దానికోసం మూడో ప్రపంచ యుద్ధం తరహా వాతావరణం తేవడం ఎందుకులే అని ఇతర దేశాలు స్పందించకుండా ఉంటె కాస్త ప్రమాదమే. అలాగని స్పందిస్తే, చైనా కూడా తగిన విధంగా ఆ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి కూడా.

ఇలా చైనా అనుక్షణం యుద్ధ వాతావరణం కోసం ప్రయత్నిస్తుంది తప్ప శాంతిని కోరుకోవడం లేదు. దేశం సంక్షోభంలో ఉన్నప్పటికీ దానికి వాతావరణాన్ని ధ్వంసం చేసేందుకే మనసు వస్తుంది. అందుకు కారణం కూడా తెలిసిందే, జిన్ కు అధికారం శాశ్వతంగా కావాలి అంటే ఈసారి కూడా ఏదైనా దేశంతో యుద్ధం చేయాలి, గెలవాలి. అది ఆయన స్వార్థం కావచ్చుగాక, కానీ ఇక్కడ ఎన్నో దేశాలు నలిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా తో నలిగిపోయిన దేశాలు మళ్ళీ యుద్ధం అంటూ మొదలుపెడితే, మరింతగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. ఇదంతా ఆలోచిస్తున్నందున ఎప్పుడు చైనా ఏ వ్యూహంతో తైవాన్ పైకి వెళ్తున్నది అర్ధం కానీ పరిస్థితి నెలకొంది, దానిని అంతర్జాతీయ సమాజం ఎలా స్పదిస్తుంది అనేది కూడా సందేహంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: