ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత రక్షణ బడ్జెట్ పెద్దగా ఏమి ఎక్కువ కాకపోవచ్చు కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కేంద్రం ఈ తరహా కేటాయింపులను ప్రతి ఏడాది పెంచుకుంటూ వస్తుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఒకపక్క చైనా, మరోపక్క పాక్, ఇక తాలిబన్ లు ఎలాగూ ఉండనే ఉన్నారు. వీరందరి కలయిక భారత్ కు ప్రమాదమే అని తెలుస్తుంది. అలాగే చైనా ఇటీవల సరిహద్దులలో కవ్వింపు చర్యలు ఇలాంటివి అన్ని గమనిస్తే దాదాపు యుద్ధ వాతావరణం తలపిస్తుంది. అందుకే కేంద్రం కూడా బడ్జెట్ పెంచుకుంటూనే వస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఇదోక భారంగా కనిపిస్తున్నప్పటికీ, తప్పని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. అందులో కూడా తగినంత కేటాయింపులు చేయలేని పరిస్థితి అని ఒప్పుకుంటూ ఉండటం కొసమెరుపు.

గతంలో ప్రతిదానికి పాక్ భారత్ పై విరుచుకుపడటం చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ స్థానాన్ని చైనా దక్కించుకుంది. ఎప్పుడెప్పుడు భారత్ ను గట్టి దెబ్బ కొట్టాలా అని పాక్ కంటే గొప్ప పగతో రగిలిపోతుంది చైనా. ఇలాంటి ధోరణి గతంలో పాక్ లో చూశాం, కానీ ఇప్పుడు ఆ స్థితి చైనా కు వచ్చేసింది. పక్క దేశాలపై ఏడవడం అంటువ్యాదేమో అని ఈ స్థితిని చూస్తే అనిపిస్తుండక మానదు. పాక్ ఈవిషయంలో కాస్త సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, భారత్ ను ఇన్నాళ్లు తానేమి చేయలేకపోయినందుకు ఇప్పుడు చైనా లాంటి దేశం తన పగను పంచుకుంటున్నందుకు ఈ సంతోషం ఉంటుంది. తాను మసైపోతున్నప్పటికీ, పక్కవాడు తగలబడుతుంటే చూసి నవ్వే గొప్ప గుణం అంతర్జాతీయంగా కూడా ఉందని ఈ రెండు దేశాలను చూసి చెప్పవచ్చు.

ఇలాంటి పరిస్థితులలో ఎప్పటివో ఆయుధాలు పెట్టుకొని యుద్దభూమిలోకి వెళ్లడం సాధ్యం కానిపని. అందుకే అన్నీ కొత్త ఆయుధాలు సమకూర్చుకునేంత ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం లేకపోవడంతో ఉన్నంతలో సరికొత్త సాంకేతికత గల ఆయుధాలను, వనరులను భారత్ ఆయా దేశాల నుండి సమకూర్చుకుంటుంది. అందుకే 2019-20 లో 4 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయించింది ప్రభుత్వం. 2020-21లో ఇది ఐదు లక్షల కోట్లకు చేరింది. 2021-22లో కూడా ఐదు లక్షల ను దాటేసింది రక్షణ రంగ బడ్జెట్. ఇవన్నీ ప్రస్తుత పరిస్థితికి అవసరం కాబట్టి సమకూర్చుకొంటుంది. బహుశా పరిస్థితి మెరుగ్గా ఉంటె అంటే కరోనా ఒక్కటే ఉంటె, రక్షణ బడ్జెట్ సాధారణంగానే ఉంచి, మిగిలిన ఆర్థిక వనరులు కరోనా వలన కుదేలైన రంగాల వైపు మళ్లించే అవకావం ఉండేది. ఇలాంటి ఆర్థిక దెబ్బ కొట్టాలన్నదే చైనా ఆలోచన, అందుకే యుద్దానికి సన్నాహాలు చేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: