ఆంగ్లో-శాక్సన్ దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో ఏర్పడిన గూఢచర్య కూటమిలో భారత్ ను కలుపుకునేందుకు సభ్యదేశాలు ఆసక్తి చూపుతున్నాయి.అమెరికాతో సైనిక పొత్తు లేని దేశంభారత్ ఒక్కటే. అమెరికా గూఢచర్య సమాచారాన్ని భారత్ తో పంచుకోవడానికి ఆంగ్లో-శాక్సన్ కూటమి సిద్ధపడటం ఆసక్తికర పరిణామం. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచమంతటా అమెరికాకు చైనా నుంచి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.

మున్ముందు తానే అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనా హిందూ, పసిఫిక్ మహా సముద్ర జలాల్లో, హిమాలయాల్లో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది. ఎగసిపడుతున్న డ్రాగన్ ను కట్టడి చేయడానికి అమెరికా, ఇండో పసిఫిక్ పశ్చిమాసియా క్వాడ్ ను ఏర్పరిచింది. ఆస్ట్రేలియా, బ్రిటన్ లతో కలిసి ఆకాష్ సైనిక కూటమిని ప్రారంభించింది. చైనా రష్యా నుంచి ఎదురవుతున్న పోటీని అధిగమించడానికి సాటి ప్రజాస్వామ్య దేశాలను భాగస్వామ్యులను చేసుకోవాలని సెప్టెంబర్ లో అమెరికా పార్లమెంట్ కు చెందిన గూడచర్య ప్రత్యేక కార్యకలాపాల ఉపసంఘాన్ని ప్రతిపాదించింది.

వచ్చే ఏడాది జాతీయ రక్షణ అధికార చట్టం ఈ మేరకు ఒక సవరణ  చేయాలని భావిస్తోంది. ఇప్పటికే భారత్, అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం చైనా, పాకిస్తాన్ ల గురించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చు కుంటున్నాయి. భారత్ సాధికారికంగా ఆంగ్లో-శాక్సన్ కూటమి లో చేరిక ఈ సహకారం మరింత దృఢమవుతోంది. కూటమి దేశాలు ఉపగ్రహాలతో, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో ప్రపంచమంతటి నుంచి గూఢచర్య సమాచారాన్ని  సేకరిస్తున్నాయి. గత ఏడాది భారత్ ఆస్ట్రేలియాల మధ్య కుదిరిన సైనిక వ్యూహ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఒక సైనిక స్థావరాలను మరొకరు ఉపయోగించుకోవడానికి సామాగ్రి బట్వాడా లో సహకరించుకోవడానికి డీల్ ఏర్పడింది. బ్రిటన్ తో ఇలాంటి ఒప్పందమే కుదర పోతోంది. రష్యాతోను సైనిక ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఆశిస్తున్నా ఆంగ్లో-శాక్సన్ కూటమిలో చేరితే రష్యాకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: