ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బ్రేకులు తప్పడం లేదు. వైఎస్ జగన్ మానస పుత్రికగా చెప్పుకునే పథకాలపై క్రమంగా నీలినీడలు అలుముకుంటున్నాయి. వైసీపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఓ పథకానికి ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. పథకం అసలు లబ్ధిదారులెవనే అంశంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత స్థాయి పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం నేరుగా విద్యార్థులకే నగదు చెల్లింపు చేస్తోంది. ఇందుకోసమే అమ్మ ఒడి, విద్యాదీవెన, విద్యా కానుక వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం రూపు రేఖలను వైఎస్ జగన్ మార్చేశారు. గతంలో కాలేజీలకు చెల్లించిన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ సొమ్మును ఫీజుల రూపంలో చెల్లించాలని అధికారులు విద్యార్థుల పేరేంట్స్‌కు సూచించారు. దీనికి జగనన్న విద్యా దీవెన అనే పేరు పెట్టాశారు. కానీ తల్లులు మాత్రం చాలా మంది ఆ డబ్బులను కాలేజీలకు కట్టలేదు. పైగా సొంతానికి వాడుకున్నారు.

గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదు తమకు చేరకపోవడంతో... కళాశాలల యాజమాన్యం... చివరికి హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజులను తమకు ఇవ్వకుండా... తల్లులకు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోందని పిటిషన్‌లో ఆరోపించాయి. దీంతో హైకోర్టు కూడా కళాశాల యజమాన్యానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఫీజు నగదును నేరుగా కాలేజీలకే ఇవ్వాలని ఆదేశించింది రాష్ట్ర హైకోర్టు. అయితే నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తీర్పు రాలేదు కాబట్టి మూడో సారి కూడా నేరుగా తల్లుల ఖాతాలోనే విద్యాదీవెన జమ చేసింది. అదే సమయంలో తల్లులకు వార్నింగ్ కూడా ఇచ్చారు వైఎస్ జగన్. ఆ నగదును మూడూ వారాల్లో సంబంధిత కాలేజీల్లో చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వైఎస్ జగన్. అలా చేయని వారి నుంచి ఫీజులను వసూలు చేసుకునే బాధ్యతను ఆయా కళాశాలలకే అప్పగించింది కూడా. దీనికి ఇప్పుడు కాలేజీలు కూడా అభ్యంతరం చెప్పకుండా... సరే అనేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: