పవన్ కల్యాణ్..రఘురామకృష్ణం రాజు కాంబినేషన్ నెక్స్ట్ ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్‌లో కీలకం కానుందా? ఈ కాంబినేషన్ వైసీపీకి చెక్ పెట్టగలదా? అంటే ముందు ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందనే విషయాన్ని ఒక్కసారి గమనిస్తే...ఇప్పుడు రఘురామ వైసీపీ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రెబల్‌గా ఉన్నారు...వైసీపీ తరుపున గెలిచిన సరే..ఆ తర్వాత నుంచి రఘురామ పూర్తిగా వైసీపీకి యాంటీ అయిన విషయం తెలిసిందే. ఇక రఘురామ, వైసీపీల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో కూడా తెలిసిందే.

అయితే వచ్చే ఎన్నికల్లో రఘురామ వైసీపీ తరుపున బరిలో దిగడం కుదరని పని అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతర్గతంగా జరుగుతున్న చర్చలు ప్రకారం చూస్తే ఆయన టీడీపీ తరుపున నరసాపురం పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఒకవేళ టీడీపీ-జనసేనల పొత్తు ఫిక్స్ అయి నరసాపురం సీటు జనసేనకు కేటాయిస్తే...రఘురామ జనసేన తరుపున బరిలో దిగడం ఖాయమే. టీడీపీకే ఆ సీటు ఉంటే ఆ పార్టీ తరుపునే బరిలో దిగుతారని తెలుస్తోంది.

సరే ఏది ఎలా జరిగినా టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా నరసాపురం బరిలో రాజుగారు పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అదే సమయంలో భీమవరంలో పవన్ కల్యాణ్ పోటీ చేయడం కూడా ఖాయమని తెలుస్తోంది. ఈ సారి మాత్రం పవన్, భీమవరంలోనే పోటీ చేస్తారని సమాచారం.

అందుకే ఇటీవల చంద్రబాబు కూడా భీమవరంలో టీడీపీ ఇంచార్జ్‌ని సైతం మార్చేశారు. తాత్కాలికంగా తోట సీతారామలక్ష్మిని ఇంచార్జ్‌గా పెట్టారు. పవన్ కోసం భీమవరంలో టీడీపీని డమ్మీ చేసినట్లు తెలుస్తోంది. ఇలా భీమవరంలో పవన్, నరసాపురం పార్లమెంట్‌లో రాజు గారు పోటీ చేయడంతో...అక్కడ సమీకరణాలు పూర్తిగా టీడీపీ-జనసేనకు అనుకూలంగా మారిపోతాయనే పరిస్తితి ఉంది. ఈ ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలని సైతం ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి పవన్-రాజు గారి కాంబినేషన్ సక్సెస్ అవుతుందో లేదో?  

మరింత సమాచారం తెలుసుకోండి: