గత ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగిన పార్లమెంట్ స్థానాల్లో మచిలీపట్నం కూడా ఒకటి. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 వైసీపీ గెలుచుకుంది...ఇక గన్నవరంలో టీడీపీ తరుపున గెలిచిన వల్లభనేని వంశీ..తర్వాత వైసీపీ వైపుకు వచ్చేసిన విషయం తెలిసిందే. దీంతో మచిలీపట్నంలో పూర్తిగా వైసీపీ ఆధిక్యం ఉందని చెప్పొచ్చు.

అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయిపోయాయి...మరి ఇప్పటికీ కూడా మచిలీపట్నంలో వైసీపీ హవా ఉందా? టీడీపీ ఏమన్నా పుంజుకుందా? అంటే ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్న రాజకీయ పరిస్తితులని చూసుకుంటే వైసీపీకి అనుకూలంగా మాత్రం పరిస్తితులు కనిపించడం లేదు. ఏదో అధికార బలం వల్ల పూర్తిగా లోపాలు బయటపడటం లేదు...గానీ క్షేత్ర స్థాయిలో మాత్రం వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది.

మచిలీపట్నం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఇదే పరిస్తితి ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు పెద్దగా సంతృప్తిగా ఏమి లేరు. కాకపోతే ప్రభుత్వ పథకాలు వస్తుండటంతో ప్రజలు జగన్ పట్ల మాత్రం సంతృప్తిగా ఉన్నారు. అసలు మచిలీపట్నం అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని కావొచ్చు...గుడివాడలో మంత్రి కొడాలి నాని కావొచ్చు..ఇంకా పెడనలో జోగి రమేష్, అవనిగడ్డలో సింహాద్రి రమేష్, పామర్రులో అనిల్, పెనమలూరులో పార్థసారథి, గన్నవరంలో వల్లభనేని వంశీలపై పూర్తిగా పాజిటివ్ మాత్రం కనిపించడం లేదు. అంటే రెండున్నర ఏళ్లలోనే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందని చెప్పొచ్చు.

అలా అని ఇక్కడ సైకిల్ స్పీడ్ ఏమి పెరగలేదు. ఏదో ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ కాలేదు. మచిలీపట్నం, పెనమలూరు, పెడన స్థానాల్లో మినహ గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి సరిగ్గా లేదు. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి ఘోరంగానే ఉంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మచిలీపట్నంలో రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: