పాక్ మరోసారి తన బుద్ది చూపించాలని భావించింది, నిజమే దాని పరిస్థితి అంత అద్వాన్నంగా తయారైంది మరి. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఆఫ్ఘన్ వ్యవహారం అందరికి తెలిసిందే. దీనితో అక్కడ ప్రజలకు కాస్త తిండి పెట్టడానికైనా తాలిబన్ లు ఇష్టపడటం లేదు. అందుకే ప్రపంచం సాయం చేయాలని కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి. అవన్నీ సరాసరిగా ప్రజలకు అందటం లేదని తేలింది. దీనితో భారత్ కొన్ని నియమాలతో తన సాయాన్ని నేరుగా ఆఫ్ఘన్ ప్రజలకు అందించాలని యోచించింది. అందుకు యూఎస్ బృందాన్ని కూడా తోడుగా ఉండాలని, తాలిబన్ ప్రభుత్వ జోక్యం ఉండరాదని, పాక్ సరిహద్దు మీదుగా సరుకు రవాణా చేసినప్పటికీ, భారత వాహనాలలోనే ఆ సరుకు ఆఫ్ఘన్ చేరుకోవాలని ఈ నిబంధనలు.

అయితే భారతదేశం ఇస్తున్న దానిని తాను ఇచ్చినట్టుగా చెప్పుకోవడానికి లేదా కొంత నొక్కేసి సొంతానికి వాడుకోవడానికి పాక్ కుట్రలు పన్నింది. ఎలాగూ దాని భూభాగం మీదుగా సరుకు రవాణా అవుతుంది కాబట్టి, పాక్ కూడా తమ నిబంధనలు తెలిపింది. అందులో ఉన్నవి, భారత వాహనాలు పాక్ సరిహద్దులలో ఆగిపోవాలి, అక్కడ నుండి సరుకు తమ వాహనాలలో వెళ్తుంది. అలాగే ఆయా టోల్స్ దాటడానికి, పన్ను భారత్ చెల్లించాలి. ఈ నిబంధనలు చూస్తే ఖచ్చితంగా తాను కొంత నొక్కేయవచ్చు లేదా తన వాహనాలలో సరుకు ఆఫ్ఘన్ వెళ్తుంది కాబట్టి సాయం భారత్ కాదు, తానే చేసినట్టుగా భ్రమకల్పించవచ్చు. ఇవి పాక్ నీచమైన నిబంధనల వెనుక ఉన్న ఆలోచనలు.

అవన్నీముందుగానే కనిపెట్టిన భారత్ జాగర్త వచించి, ఆఫ్ఘన్ వరకు భారత వాహనాలే వెళ్తాయని స్పష్టం చేసింది. అది కూడా యూఎస్ బృందం తో కలిసి ఆఫ్ఘన్ వెళ్లనున్నాయి ఆ వాహనాలు. స్వయంగా భారతసిబ్బంది ఆఫ్ఘన్ ప్రజలకు ఆయా ఆహార పదార్దాలను అందించనున్నారు, అదికూడా యూఎస్ బృందం సమక్షంలో. ఇది భారత్ నిబంధనలు, పాక్ కు తగ్గట్టుగా ఎత్తు వేసింది. భారత్ అందించే సాయంలో 50వేల టన్నుల గోధుమలు, ఔషదాలు, వైద్య పరికరాలు వంటివి ఉన్నాయి. ఇవన్నీ స్వయంగా భారత్ అక్కడ వారికి అందించనుంది. ఇక పాక్ భూభాగం ముందుగా ఎందుకు అంటే ప్రయాణ సమయం, ఖర్చు తగ్గుతాయని అలా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: