ఒకపక్క కాంగ్రెస్ మరోపక్క బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అక్కడ ప్రియాంక గాంధీ ప్రచారం ప్రారంభించేసింది. కొత్త కొత్త పధకాలు, ఆఫర్లను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తుంది. అక్కడ ఒక్కచోట గెలిస్తే, దేశంలో ఇతర చోట్ల పెద్దగా సమస్య ఉండబోదని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు పన్నుతోంది. దీనిలో భాగంగా రాహుల్ ను పక్కన పెట్టి ప్రియాంక గాంధీని రంగంలోకి దించారు. ఇక అధికారంలో ఉన్న బీజేపీ కూడా తక్కువ ప్రయత్నాలు చేయటం లేదు. ఉన్న యోగి ప్రభుత్వాన్ని మరోసారి నిలబెట్టాలని యావత్ బీజేపీ నాయకత్వం కృషిచేస్తుంది. ఎప్పుడు ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ నేతలను రంగంలోకి దించడం చూస్తూనే ఉంటాం. అలాగే యూపీలో కూడా ఈసారి జాతీయ నేతలంతా తీవ్రంగా పర్యటించే ప్రణాళికలు సిద్ధం చేశారు.

కాంగ్రెస్ భావిస్తున్నట్టుగానే, బీజేపీ కూడా యూపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంది. అక్కడ మళ్ళీ భారీ మెజారిటీతో గెలిచి తమ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో తిరుగులేదని నిరూపించుకోవాలని తీర్మానించుకుంది. దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్రచార ప్రణాళిక మార్చుకుంటూ వ్యూహరచన చేస్తున్నారు. మోడీ సహా పలువురు నేతలు యోగి కోసం ప్రచారం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటివరకు యోగి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ని అంతా ప్రజలలోకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయనుంది బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 స్థానాలో యాత్ర కొనసాగుతుంది. తద్వారా ప్రజల అందరికి మరోసారి బీజేపీ భరోసా ఇవ్వనుంది.

బీజేపీ మొత్తం నియోజక వర్గాలలో ఆరు విడతలుగా ఈ యాత్ర చేయనుంది. మొత్తం యాత్రలో జాతీయ, ప్రాంతీయ నేతలు, ఇతర సెలెబ్రిటీలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ యాత్ర ద్వారా బీజేపీ సాధించిన ప్రతి విజయాన్ని ప్రజలకు తెలుపనుందని యోగి ఆదిత్యనాధ్ అన్నారు. గతంలో ఇలాంటి యాత్ర లో భాగంగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం జరిగింది, ఈసారి తాము చేసిన పనులను తెలియజెప్పడం ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది. బీజేపీ కరోనా సమయంలో కావచ్చు, ఇతర సంక్షేమ పధకాల విషయంలో కావచ్చు ప్రజలు సంతృప్తిగా ఉన్నారని యోగి అన్నారు. ఈ సారి బీజేపీ 300పైగా సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తమ అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: