ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీల నేతలు ఉపయోగించే భాష అత్యంత దారుణంగా మారిపోయింది. చివరికి తమ స్థాయిని, స్థానాన్ని మరిచిపోయి కూడా మాట్లాడుతున్నారు నేతలు. మంత్రుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా విచక్షణ మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల శాసన సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సాక్షాత్తు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఇక మంత్రి కొడాలి నానికి ప్రతిపక్ష నేతలు బూతుల మంత్రి అని పేరు పెట్టేశారు కూడా. ఇప్పుడు తాజాగా మరో మంత్రి కూడా ఆ జాబితాలో చేరేలా ఉన్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. పోలవరం ప్రాజెక్టు ప్రారంభం ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ మీడియా సంస్థల అధినేతలపైన, ప్రతిపక్ష నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నోరు పారేసుకున్నారు. అరే ఓరే అనటంతో పాటు... మరో అడుగు ముందుకు వేశారు. తన చుట్టూ మహిళలు ఉన్నారనే విషయం కూడా మంత్రి గారు మర్చిపోయారు. ప్రజా ప్రతినిధి, బాధ్యత గల మంత్రి అనే విషయాన్ని కూడా మరిచారు అనిల్ కుమార్ యాదవ్.