గత కొంత కాలం నుంచి దేశ రాజధాని ఢిల్లీ ప్రజలందరూ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకేంటి దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది అనే విషయం తెలిసిందే. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి గాలిలో నాణ్యతలేని పరిస్థితి నెలకొంది.. మరోవైపు అటు కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వేధించింది. అయితే గత కొంతకాలం నుంచి ఢిల్లీలో గాలి కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోవడం ఆందోళనకరంగా మారిపోయింది.


 ఢిల్లీలో వాహనాలు పెరిగిపోవడం వాటి నుంచి వెలువడే కాలుష్య ఉద్వారాలా ద్వారా ఏకంగా గాలి నాణ్యత పై ప్రభావం పడుతుంది.  సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా పంజాబ్ లలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం కూడా ఢిల్లీలో గాలి కాలుష్యానికి కారణం అవుతుంది అని చెప్పాలి. గాలి కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతు ఉండడం గాలిలో నాణ్యత తగ్గిపోతుండటంతో అటు ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుని కేజ్రీవాల్ సర్కార్. వాయు కాలుష్యం దృష్ట్యా శుక్రవారం నుంచి అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నాము అంటూ తెలిపింది  కేజ్రీవాల్ ప్రభుత్వం.



 తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా పాఠశాలలో మూసివేయబడతాయ్ అంటూ అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గాలిలో నాణ్యత మెరుగవుతుంది అన్న సూచనలను పరిగణలోకి తీసుకొని పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తాం అంటూ స్పష్టం చేశారు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్  గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడం తోనే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే నవంబర్ 13న మూతపడిన పాఠశాలలు కళాశాలలు ఇటీవలే సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాగా కాలుష్యం దృష్ట్యా అటు పాఠశాలలు ప్రారంభించే అంశంపై మాత్రం సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంతలోనే కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: