ఇండియా, పాకిస్తాన్‌.. రెండూ ఒకప్పుడు ఒకే దేశంలో అంతర్భాగాలు.. బ్రిటిష్ వాళ్లు వెళ్తూ వెళ్తూ ఇండియాను రెండు ముక్కలు చేశారు.. జిన్నా ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా పాకిస్తాన్‌కు ఊపిరిపోశారు. ఇండియా కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం సంపాదించిన పాకిస్తాన్ ప్రయాణం మాత్రం ఇండియాకు పూర్తి భిన్నంగా సాగుతోంది. ఇండియా ప్రజాస్వామ్య దేశంగా చాలా రంగాల్లో పురోగతి సాధిస్తుంటే.. పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్ర పడింది.


మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకు వస్తోందంటే.. తాజాగా ట్విటర్‌కు సీఈవోగా పరాగ్ అగర్వాల్‌ నియమితులయ్యారు కదా. దీంతో ఇండియన్లే చాలా ఎంఎన్‌సీలకు సీఈవోలు అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. భారతీయుల ప్రతిభాపాటవాలను ప్రపంచమంతా పొగుడుతోంది. విచిత్రం ఏంటంటే.. ఇండియా పొడ పెద్దగా గిట్టని పాక్ దేశస్తులు కూడా ఈ విషయంలో ఇండియాను మెచ్చుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వైఫల్యాలను పైన కూడా అక్కడి నెటిజన్లు విమర్శలు చేసుకుంటున్నారు.


పాకిస్తాన్‌లోని సర్వే ఆటో ఇన్‌కార్పొరేషన్ సీఈవో ఒమర్ సైఫ్ ఇండియన్లను మెచ్చుకున్నారు. ట్విట్టర్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సహాపలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న భారతీయుల వివరాలను ఒమర్‌ పోస్టు చేశారు. పోటీ పడటానికి ఇది చాలా చక్కటి మార్గమని సొంత దేశమైన పాకిస్తాన్‌కు ఒమర్‌ హితవు పలికారు. మరో పాకిస్తానీ ఒకవైపు ప్రముఖ భారతీయ సీఈవోలు మరోవైపు పాకిస్థాన్‌ తయారు చేసిన కరుడుగట్టిన ఉగ్రవాదులున్న చిత్రాన్ని జోడించి పోస్ట్ చేశారు. దిసీస్‌ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటూ కామెంట్ పెట్టాడు.


పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ వసీమ్ అబ్బాసీ కూడా పాక్‌ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ ప్రపంచానికి గొప్ప మేథస్సును అందిస్తుంటే పాక్ మాత్రం ఇలాగే ఉండి పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సొహైల్ నూర్ ఖాన్ అనే మరో పాక్‌ పౌరుడు ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్ గతంలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: