ఇప్పటికే కరోనా మహమ్మారి ఫస్ట్ సెకండ్ వేవ్ లు ప్రపంచమంతా గడగడలాడించాడు. దీని దాటికి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమై, ఎంతో మంది మృతి చెందారు. ఇంతటి విపత్కర పరిస్థితులను సృష్టించిన ఈ మహమ్మారి రకరకాలుగా తన రూపం మార్చుకుని మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడే కోరుకుంటున్న తరుణంలో మళ్లీ  ప్రజల్లో అలజడి సృష్టిస్తోంది. ఓమిక్రాన్ పేరుతో వస్తున్న ఈ వేరియంట్ పొరుగు దేశాల్లో తీవ్రంగా దాడి చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలోనే ఈ వేరియంట్ రావడంతో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కి పడుతున్నాయి.

 ఇప్పటికే కరోణ దాటి తీవ్రంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న దేశాలు, మళ్లీ కోలుకుంటున్న సమయంలో ఈ వేరియంట్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మెల్లగా భారత్లో కూడా ప్రవేశిస్తోంది. ఇప్పటికే రెండు నుంచి మూడు కేసులు వచ్చిన తరుణంలో జనం భయంతో పరుగులు పెడుతున్నారు. జనాల్లో పలు ప్రశ్నలు కూడా మెదులుతున్నాయి. లాక్ డౌన్  లాంటివి ఏమైనా ఉంటాయా అని అనుకుంటున్నారు. పాఠశాల నడుస్తాయా.. అన్న చర్చ కూడా సాగుతోంది. కరోణ మొదటిసారి వచ్చినప్పుడే దాదాపు మూడు నెలల పాటు లాక్డౌన్ విధించాయి ప్రభుత్వాలు. ఆ తర్వాత డెల్టా వేరియంట్  రూపంలో మూడు రెట్ల వేగంతో మరోసారి కరోణ సెకండ్ వేవ్ రావడంతో మరోసారి లాక్ డౌన్  విధించిన ప్రభుత్వాలు, మళ్లీ ఓమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని  డబ్ల్యూహెచ్వో వెల్లడించింది.

 దీంతో భారతదేశంలో లాక్ డౌన్  తప్పదనే ప్రశ్న అందరి మనసులో మెదులుతుంది. దీనిని ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఆపాలంటే కరోణ నియమాలు తప్పనిసరి అంటున్నారు డాక్టర్లు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా పాటించాలని, శానిటైజర్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటిస్తే తప్పకుండా ఈ వైరస్ను ఆపగలమని, అలాగే ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకొని ఇమ్యూనిటీని  పెంచుకోవాలని అంటున్నారు. కాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వేడి ఎంత  వరకు కట్టడి చేస్తాయో ముందు ముందు వేచి  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: