రైతు ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్, నిలువ, కొనుగోలు, అమ్మకం, రైతులకు గిట్టుబాటు ధర వంటి అంశాలు మరింత మెరుగుపడాలని ఇటీవలి కాలంలో రైతులు కోరుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు సంస్థలు కంపెనీల చేతుల్లో చిక్కి బలిపశువులు కాకుండా అన్ని పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించటం ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్తో గత కొన్ని సంవత్సరాలుగా రైతు ఉద్యమాలు భారతదేశంలో ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నవి. 2020 సెప్టెంబర్ మాసంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుల మేలు కోసమే నంటూ తెచ్చిన మూడు చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు గా ముద్ర పడటంతో చట్టాల రద్దు అనే విషయం తెరమీదికి వచ్చింది.

 రైతు చట్టాల రూపకల్పనలో చర్చ జరిగిందా:
     2020 సెప్టెంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు జరుగుతుందనే నెపంతో రైతు సంఘాల తో కానీ ప్రతిపక్షాలతో కానీ ఎలాంటి చర్చ చేయకుండానే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టినవి. బిల్లులను ప్రవేశ పెట్టే ముందు ప్రభుత్వం తన ఉద్దేశ్యాన్ని ప్రకటిస్తూ రైతు పండించిన పంటకు ఎక్కువ ధర రావాలంటే దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ,ఆ స్వేచ్ఛా స్వాతంత్రం రైతులకు ఉండాలని, ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా మరింత ధర పొందవచ్చని అనేక సాకులతో బిల్లులను ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ బిల్లుపై సమగ్ర చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టినప్పుడు ఇలాంటి చర్చకు ప్రభుత్వం ఆమోదించకుండా ప్రతిపక్ష సభ్యులను బహిష్కరించడం ద్వారా ఏకపక్షంగా ఆమోదింప చేసుకోవడం జరిగింది.


చట్టసభల బయటగాని చట్టసభల్లో గాని చర్చించకుండా దేశ ప్రజలకు మెజారిటీ రైతాంగానికి మేలు జరుగుతుంది అంటే ఎలా నమ్మగలం? అయినా నియంతృత్వ ప్రభుత్వాలు రైతు ఉత్పత్తి మార్కెట్ వ్యవస్థ మొత్తాన్ని ఆ దాని అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్ట డానికి చేసిన కుట్ర గానే ఈ రైతు చట్టాలను రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: