సెప్టెంబర్ మాసంలో ఆమోదించిన టువంటి రైతు చట్టాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు ప్రతిపక్షాలు వ్యతిరేకించటం తోపాటు ఈ అంశం ప్రధాన అంశంగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఈ క్రమంలో భారతదేశంలోని రైతు సంఘాలన్నీ ఐక్యవేదిక గా ఏర్పడి 2020 నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సమ్మె ప్రారంభించడం ద్వారా తమ నిరసన ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వి. భారత్ బంధు, ట్రాక్టర్ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు అనేక రీతిగా ఉద్యమానికి రూపకల్పన చేసి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వేలాది మంది రైతులు గత సంవత్సర కాలంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థను కూడా కదిలించారు. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని రైతుల చట్టబద్ధమైన టువంటి స్వేచ్ఛను హరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని అంతవరకు తాత్కాలికంగా ఉపసంహరించుకొమ్మని ఆదేశించడంతో ప్రభుత్వం గత సంవత్సరం తాత్కాలికంగా రద్దు చేసుకోవడం జరిగింది. అయినప్పటికీ రైతు ఉద్యమం ఆగ లేదు సరికదా ప్రభుత్వాలు విధించిన నిర్బంధాల లో 700 మందికి పైగా రైతులు వేర్వేరు కారణాల వల్ల ఉద్యమంలో ప్రాణాలు వదిలారు. లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం,  రోడ్లమీద కందకాలు, ఇనుప చువ్వలు నాటడం తో అనేక మందికి గాయాలు అయ్యాయి. ఆసుపత్రుల పాలైనారు.

       రైతు ఉద్యమానికి ప్రతిపక్షాలతో పాటు ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బాహాటంగా మద్దతు పలికి తమ సహకారాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలు దిగజారుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 20 21 నవంబర్ 19వ తేదీన జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రైతులు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి జాతికి క్షమాపణ చెప్పినాడు. అంటే కేంద్ర ప్రభుత్వము కూడా రైతు ఉద్యమానికి ప్రభావితము కాక తప్పలేదు .రైతుల ఉద్యమంలోని సాధ్యాసాధ్యాలను అంతర్గత ప్రయోజనాలను అనివార్యంగా అంగీకరించక తప్పలేదు.
    చట్టాల ఉపసంహరణ లోనూ చర్చ లేదు:
    ప్రజాస్వామ్య విధానం అంటేనే ఇచ్చిపుచ్చుకునే విధానము, పరస్పర  చర్చలు, సానుకూల వైఖరితో ఏకాభిప్రాయాన్ని సాధించే క్రమంలో ప్రహసనంగా భావిస్తారు. దానికి భిన్నంగా వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నవంబర్ 29వ తేదీన తొలిరోజునే రైతు చట్టాల విరమణ బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లుపై ప్రభుత్వ పక్షాన మాట్లాడుతూ రైతులకు ఎంతో ప్రయోజనకరమైన చట్టాలు అని ఇవి అమలులో ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేదని కానీ రైతులు వ్యతిరేకిస్తున్నందున రైతులను ఒప్పించలేకపోతున్నాము కనుకనే చట్టాలను ఉపసంహరించుకుo టున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.


 రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుందో చట్టాలు చేసిన నాడు చర్చ జరగలేదు. కానీ ఉపసంహరించే నాడు కూడా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబడితే అనుమతించకుండా అల్ప వ్యవధిలోనే లోక్సభలో రాజ్యసభలో ఆమోదింప చేసుకోవడం లోని ఆంతర్యం ఏమి..రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చర్చకు అవకాశం గనుక ఇస్తే చట్టాలలోని మెరిట్స్ ను ప్రభుత్వము ప్రతిపక్షాలకు వివరించాల్సి ఉంటుంది. అంతో ఇంతో దేశవ్యాప్తంగా ఉన్న మార్కెట్ వ్యవస్థ ద్వారానే రైతులకు కొంత మేలు జరుగుతుంది. ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్న చోట రైతుల అవసరాల రీత్యా కార్పొరేట్ వ్యక్తుల నిర్బంధానికి రైతులు గురికాక తప్పడంలేదు. కొత్త చట్టాల ప్రకారం గా మార్కెట్ వ్యవస్థను లేకుండా చేసి ఆదాని అంబానీలకు మార్కెటింగ్, ఉత్పత్తి, పంపిణీ లాంటి వ్యవస్థలను కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్న సందర్భంగా రైతులకు ఎలాంటి లాభం జరుగుతుందో చట్టసభల్లో ప్రభుత్వం వివరణ ఇవ్వవలసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: