భువనేశ్వరిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు గన్నవరం టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతు తాను భువనేశ్వరి గురించి అలా మాట్లాడి ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి కూడా వంశీ గుర్తు చేసుకున్నారు. సరే భువనేశ్వరి కేంద్రంగా జరుగుతున్న వివాదానికి తనవంతుగా ఫులిస్టాప్ పెట్టడానికి వంశీ ప్రయత్నం చేసినట్లుగానే కనబడుతోంది.

వంశీ తరపున క్లారిటి వచ్చింది కాబట్టి ఇపుడందరి దృష్టి చంద్రబాబునాయుడుపైన పడింది. నిజానికి భువనేశ్వరి గురించి వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలామందికి తెలీదనే చెప్పాలి. కమ్మ సామాజికవర్గంలోనే చాలామందికి వంశీ చేసిన వ్యాఖ్యలపై అవగాహన లేదు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎంఎల్ఏలు తన భార్యను అవమానించారంటు చంద్రబాబు చేసిన గోల తర్వాత మీడియా సమావేశంలో భోరున ఏడ్చిన తరువాతే వంశీ చేసిన వ్యాఖ్యలను తెలుసుకునేందుకు వీడియోలు వెతికారు.

మీడియా సమావేశంలో ఏడ్వడంతో చంద్రబాబు సరిపెట్టుకోకుండా కడప, చిత్తూరు జిల్లాల పర్యటనలో ఎక్కడ మాట్లాడినా తన భార్య భువనేశ్వరిని వైసీపీ ఎంఎల్ఏలు అవమానించారంటు రచ్చ రచ్చ చేశారు. చంద్రబాబు చేసిన రచ్చ తర్వాత పై జిల్లాల్లోని జనాలు అసలు భువనేశ్వరి గురించి ఎవరేమన్నారు అనే వీడియోల గురించి వెతికారు. అంటే భువనేశ్వరి గురించి వంశీ చేసిన కామెంట్లు ఎంత డ్యామేజీగా ఉన్నదో అంతేస్ధాయిలో చంద్రబాబు చేసిన గోల కూడా డ్యామేజి చేశాయి.

మరిపుడు వంశీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన నేపధ్యంలో చంద్రబాబు ఏమి చేస్తారు ? అనేది కీలకంగా మారింది. ఇకనుండి తన భార్య భువనేశ్వరికి అవమానం జరిగిందనే విషయాన్ని చంద్రబాబు ప్రస్తావన తేకుండా వదిలేస్తారా ? అన్నది చూడాలి. ఎందుకంటే భువనేశ్వరి వివాదాన్ని రాజకీయంగా లబ్దిపొందేందుకు చంద్రబాబు ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు వచ్చిన ఉపయోగం ఏమీ లేకపోయినా మరి ఏమాశించి పదే పదే భువనేశ్వరి వివాదాన్ని ప్రస్తావిస్తున్నారో అర్ధం కావటంలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: