సీఎం గారు... సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్. ఇందుకు ప్రధాన కారణం కూడా చాలా విచిత్రమైనదే. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తున్న ఏకైక మహమ్మారి కరోనా వైరస్. ఎప్పటికో ఎన్నో రూపాంతరాలు పొందిన ఈ మహమ్మారి... ఇప్పుడు తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ పేరుతో ప్రపంచాన్ని కుదిపేస్తోంది కూడా. ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన ఈ వేరియంట్ అన్నిటికంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది కూడా. అలాగే వ్యాక్సిన్ డబుల్ డోసులు తీసుకున్న వారికి కూడా ఓమిక్రాన్ వేరియంట్ సోకుతుంది. ఇప్పటికే భారత్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ ఇద్దరూ కూడా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారే. అయినా సరే వారికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్రం కూడా కీలక ఆదేశాలు చేసింది. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఆదేశించింది. భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది.

కానీ తాజాగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరద బాధితులను ఆంధ్రప్రదేశ్ రాష్టర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడా కూడా మాస్క్ ధరించలేదు. కనీసం సోషల్ డిస్టెన్స్ కూడా పాటించటం లేదు. ముఖ్యమంత్రి పర్యటనలో పార్టీ నేతలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ గుంపులో ఎవరో ఒకరో ఇద్దరో మినహా... మిగిలిన వారు ఎవరూ కూడా మాస్కు ధరించటం లేదు. దీంతో ఇప్పుడు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన కీలక స్థానంలో ఉన్న వ్యక్తి... ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మీరే మాస్క్ పెట్టుకోకపోతే... మేము ఎందుకు పెట్టుకోవాలని నిలదీస్తున్నారు కొందరు. ఇక కొందరు ప్రతిపక్షాల నేతలతై... తమదైన శైలిలో సెటైర్లు కూడా వేస్తున్నారు. సార్.. స్పీకర్ గారు చెప్పినట్లు ఇది కమానా వైరస్ కాదు... కరోనా... జాగ్రత్త సార్... అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో... ముఖ్యమంత్రి గారికి మాస్కులంటే పడదేమో... అందుకే ఒక్కసారి కూడా మాస్కు పెట్టుకోలేదు... అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా... నలుగురికి చెప్పే ముందు మనం పాటించాలి అనే సూత్రం ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: